Cobra Attack: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఆడుకుంటున్న బాబు.. దూసుకొచ్చిన పాము.. అప్పుడేం జ‌రిగిందంటే...

వీడియోలోని దృశ్యాలు

వియ‌త్నాంలోని ట్రాంగ్ ప్రావిన్స్‌లో ఓ చిన్నారి త‌న తాత‌తో క‌లిసి ఇంటి ముందున్న వ‌రండాలో ఆడుకుంటున్నాడు. బాబును చూసుకోవ‌డానికి ప‌క్క‌నే ఆ పిల్లాడి తాత ఉన్నారు. ఈయ‌న‌కు ఇటీవ‌ల ప‌క్ష‌వాతం రావ‌డంతో వేగంగా న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నారు.

  • Share this:
ఓ ప్రమాదకరమైన త్రాచుపాము పిల్లాడిపైకి దూసుకొచ్చిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వియ‌త్నాంలో జ‌రిగిన ఈ ఘటనలో టైల్డ్ ఫ్లోర్‌పై పాము జ‌రజ‌ర‌మంటూ పాకుతున్న దృశ్యం గగుర్పాటు క‌లిగిస్తోంది. అయితే దాని బారినుంచి పిల్లాడితో పాటు, సంరక్షకుడు తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివ‌రాల్లోకి వెళ్తే... వియ‌త్నాంలోని ట్రాంగ్ ప్రావిన్స్‌లో ఓ చిన్నారి త‌న తాత‌తో క‌లిసి ఇంటి ముందున్న వ‌రండాలో ఆడుకుంటున్నాడు. బాబును చూసుకోవ‌డానికి ప‌క్క‌నే ఆ పిల్లాడి తాత ఉన్నారు. ఈయ‌న‌కు ఇటీవ‌ల ప‌క్ష‌వాతం రావ‌డంతో వేగంగా న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నారు.

బాబు ఆట‌ల‌ను చూస్తూ మురిసిపోతున్న తాత.. త‌మ ద‌గ్గ‌ర‌కు ఓ పెద్ద పాము రావ‌డాన్ని గ‌మ‌నించారు. పిల్లాడిని ఠ‌క్కున తీసే అవ‌కాశం లేక ఆయ‌న కొంచెం వెన‌క‌కు జ‌రుగుతూ బిగ్గ‌ర‌గా అరిచారు. దీంతో ద‌గ్గ‌ర‌లోనే ప‌నిచేసుకుంటున్న బాబు తండ్రి ప‌రుగున వ‌చ్చారు. నేల‌పై ఆడుకుంటున్న పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని, త‌న తండ్రితోపాటు ఇంట్లోకి వెళ్ళి త‌లుపు వేసుకున్నారు. అయితే పాము త‌మ వెనుకే వ‌స్తున్న విష‌యాన్ని గ‌మ‌నించిన తాత ఒక క‌ర్ర తీసుకుని అది త‌లుపుద‌గ్గ‌ర‌కు రాకుండా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించారు.

అదృష్ట‌వ‌శాత్తూ ముగ్గ‌రూ ఇంట్లోకి వెళ్ళి త‌లుపు వేసుకోగ‌ల‌గ‌డంతో ఆ పాము త‌లుపు సందుల్లోంచి లోప‌ల‌కు వెళ్ళ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దీంతో అక్క‌డే ఆ నాగుపాము కాసేపు అటూ ఇటూ పాకి, చివ‌ర‌కు య‌మా స్పీడుగా వెనుదిరిగి వెళ్ళిపోతున్న దృశ్యం అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ దృశ్య‌మే ఇప్ప‌డు ఇంట‌ర్నెట్‌లో సంద‌డి చేస్తోంది. దీనిని చూసిన నెటిజ‌న్లు షాక్ గుర‌య్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పాము వీడియో కోసం క్లిక్ చేయండి

పాము వాళ్ళ‌ను క‌ర‌వాల‌నే ఉద్దేశంతోనే వ‌చ్చింద‌ని అదృష్ట‌వ‌శాత్తూ వాళ్ళు త‌ప్పించుకోగ‌లిగార‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. పాము స్పీడును త‌క్కువ అంచ‌నా వేయ‌ద్ద‌ని, అది క‌నిపించ‌గానే జాగ్ర‌త్త‌గా ప‌క్క‌కు జ‌ర‌గ‌డం మంచిద‌ని మ‌రొక‌రు స్పందించారు. అది ఆహారాన్ని వెతుక్కుంటూ వ‌చ్చింద‌ని ఇంకొక‌రు కామెంట్ చేశారు.
Published by:Sambasiva Reddy
First published: