హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

South Korea millionaire: రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసిన ఫ్రిజ్​.. ఆన్​లైన్​లో కలిసొచ్చిన అదృష్టం.. ఎలాగంటే..

South Korea millionaire: రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసిన ఫ్రిజ్​.. ఆన్​లైన్​లో కలిసొచ్చిన అదృష్టం.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియా(south korea).. అదే ఫేమస్​ బీటీఎస్​ పాప్​ బ్యాండు అక్కడివారిదే. అక్కడి జెజు ద్వీపంలో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌(online)లో ఫ్రిజ్​ ఆర్డర్(order) ఇచ్చాడు. అది ఇంటికి డెలివరీ అయింది. కొత్త ఫ్రిజ్​ కదా.. శుభ్రం చేస్తుండగా దిగువ భాగంలో ఓ అట్టముక్క కనిపించింది. ఆ అట్టముక్కకు ఓ టేప్ సైతం అతికించి ఉండటం గమనించాడు కస్టమర్​. ఉత్సుకత కొద్దీ దానిని తీయడంతో లక్షాధికారి అయ్యాడు.

ఇంకా చదవండి ...

ఏ మాటకామాట చెప్పాలంటే.. ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు, బలగం ఉన్నవాడిదే రాజ్యం. మధ్యతరగతి ప్రజలు డబ్బుల కోసం ఏళ్లకు ఏళ్లు కష్ట పడుతారు. ఏదోలా బతుకీడుస్తుంటారు. దరిద్రం నెత్తిమీద డాన్స్​ చేస్తుంటే.. ఏం చేస్తాం లే అనుకుంటారు.. మరికొంతమంది రాత్రికి రాత్రే లక్షాధికారులు(millionaire), కోటీశ్వరులు అయిపోతుంటారు. దక్షిణ కొరియాలో ఒక్క ఫ్రిజ్(fridge)​.. ఓ వ్యక్తిని లక్షాధికారిని చేసింది. అవును నిజమే. ఆన్​లైన్​లో ఓ వ్యక్తి రిఫ్రిజిరేటర్​ ఆర్డర్​ చేశాడు. అది తెరిచి చూసిన అతనికి కళ్లు బైర్లు కమ్మాయి. ఫ్రిజ్(fridge)​లో లక్షలు కనిపించాయి. ఒకటా రెండా ఏకంగా 96 లక్షల రూపాయలు(96 lakhs rupees). అమ్మబాబాయ్​.. తొంబై ఆరు లక్షలే.. అంటారా? ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.. రాత్రికిరాత్రే ఆ వ్యక్తి లక్షాధికారి అయిపోయాడు. ఈ వార్త ఇపుడు సోషల్​ మీడియాలో వైరల్(viral)​ అయింది. ఇంతకీ ఎవరు పెట్టి ఉంటారు.. ఎక్కడ జరిగింది. ఎవరికి అంత అదృష్టం వరించిందో ఓ లుక్కేద్దాం..

దక్షిణ కొరియా(south korea).. అదే ఫేమస్​ బీటీఎస్​ పాప్​ బ్యాండు అక్కడివారిదే. ఆ విషయం పక్కన పెడితే అక్కడి జెజు ద్వీపంలో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌(online)లో ఫ్రిజ్​ ఆర్డర్(order) ఇచ్చాడు. అది ఇంటికి డెలివరీ అయింది. కొత్త ఫ్రిజ్​ కదా.. శుభ్రం చేస్తుండగా దిగువ భాగంలో ఓ అట్టముక్క కనిపించింది. ఆ అట్టముక్కకు ఓ టేప్ సైతం అతికించి ఉండటం గమనించాడు కస్టమర్​. ఉత్సుకత కొద్దీ దానిని తీయడంతో 1.30 లక్షల డాలర్ల (సుమారు 96 లక్షల రూపాయలు) విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. తద్వారా అతడు రాత్రికి రాత్రి(night) కోటీశ్వరుడుగా మారాడు. అయితే ఇదే సమయంలో సదరు వ్యక్తి ఆగష్టు 6వ తేదీన తన డబ్బు దొరికినట్లుగా పోలీసులకు తెలిపాడు. స్థానిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది కూడా . ఫ్రిజ్ కింద దొరికిన రూ.96 లక్షలను సదరు వ్యక్తి  వెంటనే పోలీసులకు అప్పజెప్పాడు. అయితే దక్షిణ కొరియా చట్టం ప్రకారం, ఆ డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే.. ప్రభుత్వానికి 22 శాతం పన్ను చెల్లించి ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. అలా కాదని ఎవరైనా వస్తే.. కొంత డబ్బు అతడికి పరిహారం రూపంలో వస్తుంది. ఇలా ఏది ఏమైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన ఫ్రిజ్ ద్వారా సదరు వ్యక్తి లక్షాధికారి అయ్యాడని చెప్పవచ్చు.

ఇటీవల మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో నిరుపేద రైతుకు వజ్రం దొరికి రాత్రికి రాత్రి లక్షాధికారి అయిన సంగతి తెలిసిందే. 45 ఏళ్ల లఖాన్ యాదవ్ ... ఓ పొలాన్నికౌలుకు తీసుకున్నాడు. అందుకు డబ్బు చెల్లించాడు. ఆ పొలంలో ఏ పంట వెయ్యాలి అని ఆలోచించాడు. ముందుగా దుక్కి దున్నుదాం అనుకున్నాడు. అయితే ... ఆ పొలంలో చాలా రాళ్లు ... చిన్నవీ, పెద్దవీ ఉన్నాయి. వాటిని తొలగిస్తేనే మంచిది అనుకున్నాడు. అందువల్ల రాళ్లను ఏరే పని మొదలుపెట్టాడు. అలా చిన్నా పెద్దా రాళ్లను తొలగిస్తుంటే ... ఓ రాయి కాస్త తగ్గింది. అదే వజ్రం అని తర్వాత తెలిసింది. ఆ వజ్రం ఏకంగా రూ.60 లక్షలకు పైగా ధర పలికింది.

First published:

Tags: Online service, Online shopping, South korea

ఉత్తమ కథలు