Viral Video: నాలుగేళ్ల చిన్నారి.. తన అల్లరి పనితో తల్లి ప్రాణాల మీదకు తెచ్చాడు..! ఇంతకీ ఏం చేశాడంటే....

Photo Credit : YouTube

Viral Video: పిల్లలు చేసే అకతాయి పనులు కొన్నిసార్లు సరదాగా అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు అవి ప్రాణం మీదకు తెస్తాయి. ఓ నాలుగేళ్ల పిల్లాడు చేసిన పని.. అతడి తల్లిని ఇబ్బందులపాలు చేసింది.

  • Share this:
పిల్లలు చేసే అకతాయి పనులు కొన్నిసార్లు సరదాగా అనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు అవి ప్రాణం మీదకు తెస్తాయి. ఓ నాలుగేళ్ల పిల్లాడు చేసిన పని.. అతడి తల్లిని ఇబ్బందులపాలు చేసింది. ఆమెను రక్షించడం పోలీసుల వల్ల కూడా కాలేదంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.వివరాల్లోకి వెళ్తే.. ఓ నాలుగేళ్ల బాలుడు సైకిల్‌కు వాడే లాక్‌ను ఎలా ఆపరేట్‌ చేయాలో నేర్చుకొని, దానితో ఆడుకుంటున్నాడు. అది కోడ్‌తో ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. అయితే పిల్లాడు ఆడుకుంటున్నాడని తల్లి కూడా ఆ లాక్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో, బాలుడు ఆ లాక్ కోడ్‌ను మార్చేశాడు. ఇదంతా ఆ తల్లి గమనించలేదు. ఆమె పనిలో ఆమె ఉండిపోయింది. ఇంతలో ఆమె టాయిలెట్‌ క్లీన్‌ చేస్తుండగా బాలుడు హఠాత్తుగా తల్లి మెడలో ఆ తాళం వేసి లాక్ చేశాడు. దీంతో అది లాక్‌ అయిపోయింది.

అప్పటికే బాలుడు దాని కోడ్‌ మార్చడంతో ఆమె తాళాన్ని అన్‌ లాన్‌ చేయలేకపోయింది. తల్లి నాలుగు తగిలిస్తే ఏడుస్తూ ఉండిపోయాడు తప్ప కోడ్‌ గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు బాలుడు. ఈ సంఘటన అక్టోబర్ 7న చైనాలోని ఝియాంగ్షు ప్రావిన్స్‌లోని హుయిన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆటోమెటిక్‌ తాళం కావడం, అది కోడ్‌ ద్వారానే తెరుచుకునే అవకాశం ఉండటంతో.. స్థానికులు సైతం దాన్ని మహిళ మెడ నుంచి తీయలేకపోయారు. మెడకు ఒరుసుకుపోతుండటంతో చేసేది లేక బాధితురాలు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడకపోవడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు. తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో అగ్నిమాపక బృందాన్ని పిలిపించాల్సి వచ్చింది.

ఆ వైరల్ వీడియో ఇక్కడ చూడండి :


వారు కూడా కోడ్‌ ద్వారా ఆ తాళం తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమె మెడ, ఆ తాళం మధ్యన ఒక చిన్న టవల్‌ ఉంచి.. అతి కష్టంతో వైర్‌ కట్టర్లతో ఆ తాళాన్ని తొలగించారు. ఈ ఘటనకు కారణమైన బాలుడిపై ఆ రెస్క్యూ టీమ్ సభ్యులు ఒకరు సీరియస్ అయ్యారు. కొడుకు చేసిన అకతాయి పనికి నాలుగు తగిలించానని, వాడు ఇంట్లో పడుకున్నాడని ఆ తల్లి చెప్పింది.

ఇది కూడా చదవండి : జట్టులోకి CSK స్టార్ ప్లేయర్.. భారత కొత్త జట్టు ఇదే..! ఆ ఆటగాడికి మరోసారి నిరాశే..

మహిళ మెడ నుంచి తాళాన్ని తొలగిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బాలుడు చేసిన కొంటె పని చూసి నెటిజన్లు నవ్వుకుంటే.. కొందరు మాత్రం పిల్లలను కంట్రోల్‌లో పెట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఇంకొందరు పిల్లాడిని ఆ తల్లి కొట్టకుండా ఉండాల్సిందని సూచన చేశారు.
Published by:Sridhar Reddy
First published: