హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Florida Burglar: వీడు మామూలు పులిహోర రాజా కాదు బాబోయ్.. ఏకంగా జడ్జితో జూమ్ కాల్‌లోనే...

Florida Burglar: వీడు మామూలు పులిహోర రాజా కాదు బాబోయ్.. ఏకంగా జడ్జితో జూమ్ కాల్‌లోనే...

నేరం చేసిన వ్యక్తి గానీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గానీ న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని వినమ్రంగా ఉంటారు. జడ్జి ముందు సత్ప్రవర్తనతో వ్యవహరిస్తుంటారు. దాదాపుగా చాలా మంది నేరస్తులు ఇలానే ఉంటారు. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఓ నేరస్తుడు మాత్రం ఏకంగా మహిళా న్యాయమూర్తినే తన బుట్టలో పడేసుకోవాలనుకున్నాడు. అమ్మాయిలందరి దగ్గర పులిహోర కలిపినట్టుగానే...

ఇంకా చదవండి ...

  ఫ్లోరిడా: నేరం చేసిన వ్యక్తి గానీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గానీ న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని వినమ్రంగా ఉంటారు. జడ్జి ముందు సత్ప్రవర్తనతో వ్యవహరిస్తుంటారు. దాదాపుగా చాలా మంది నేరస్తులు ఇలానే ఉంటారు. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఓ నేరస్తుడు మాత్రం ఏకంగా మహిళా న్యాయమూర్తినే తన బుట్టలో పడేసుకోవాలనుకున్నాడు. అమ్మాయిలందరి దగ్గర పులిహోర కలిపినట్టుగానే జడ్జి ముందు కూడా తన పులిహోర ఫలితానిస్తుందనుకున్నాడు. కానీ.. ఆ న్యాయమూర్తి మాత్రం ఆ వ్యక్తికి గట్టిగానే బదులిచ్చింది. ఈ విచిత్ర ఘటన ఫ్లోరిడాలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఫ్లోరిడాకు చెందిన డెమిత్రియస్ లెవిస్ దోపిడి కేసులో విచారణకు హాజరయ్యాడు. కరోనా నేపథ్యంలో.. జూమ్ కాల్‌లో న్యాయస్థానాలు కేసులను విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బ్రౌవార్డ్ కౌంటీ జడ్జ్ తబిత బ్లాక్‌మన్ ముందు జూమ్ కాల్‌లో డెమిత్రియస్‌ను పోలీసులు ప్రవేశపెట్టారు.

  ' isDesktop="true" id="753364" youtubeid="lds0QTMEyTQ" category="trending">

  జడ్జి ముందు వినమ్రంగా నడుచుకోకపోగా ఏకంగా ఆమెనే పొగడ్తలతో పడగొట్టాలని డెమిత్రియస్ ప్రయత్నించడం కొసమెరుపు. ‘జడ్జ్. మీరు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు’ అని డెమిత్రియస్ న్యాయమూర్తి తబితను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంతటితో పులిహోర కలపడం ఆపలేదు. ‘బ్లాక్‌మాన్ మేడమ్.. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా’ అని షాకింగ్ ప్రపోజల్ చేశాడు. అయితే.. డెమిత్రియస్ మాటలకు నవ్వుకున్న న్యాయమూర్తి తబిత డెమిత్రియస్‌కు అతని స్టైల్లోనే బదులిచ్చింది. ‘సరే, మిస్టర్ లెవిస్. ఇలా ఎదుటి వారిని ఆకట్టుకునేందుకు ఎక్కడైనా ప్రయత్నించు కానీ ఇక్కడ కాదు’ అని న్యాయమూర్తి తబిత లెవిస్‌కు చెప్పింది. అయితే.. లెవిస్ డెమిత్రియస్ కలిపిన పులిహోర కొంత ఫలితానివ్వడం కొసమెరుపు.

  ఈ లీగల్ కేసులో.. లెవిస్‌కు 5వేల డాలర్ల బాండును జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి తబిత తీర్పునిచ్చారు. లెవిస్ గతంలో కూడా ఓ కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇదిలా ఉంటే.. నేరస్తుడు లెవిస్ న్యాయమూర్తి తబితకు ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని మిలియన్ల మంది ఆ వీడియోను వీక్షించారు.

  First published:

  Tags: Florida, Trending videos

  ఉత్తమ కథలు