INFOSYS | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి జీవితంపై సినిమా..

Infosys | నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి.. జీవితాన్ని తెరపైకి ఎక్కించేందుకు దర్శకుడు అశ్వినీ అయ్యర్ తివారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ, మహవీర్ జైన్ నిర్మిస్తున్నారు.

news18-telugu
Updated: October 15, 2019, 3:17 PM IST
INFOSYS | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి జీవితంపై సినిమా..
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
news18-telugu
Updated: October 15, 2019, 3:17 PM IST
ఆయన ఎందరికో మార్గదర్శి.. మరెందరికో స్ఫూర్తి.. ఇంకెందరికో జీవిత ప్రదాత. భార్య దగ్గరే అప్పు చేసి చిన్న కంపెనీ పెట్టి.. దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందించి, ఓ వ్యవస్థను నిర్మించారాయన. విలువలతో కూడిన పాఠాలు నేర్పుతూనే, జీవితంలో దానగుణం ఎంత అవసరమో చేతల్లో నిరూపించారు. ఆయనే.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి(నాగవర రామారావు నారాయణ మూర్తి). పూణెలో 1981లో ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించిన నారాయణ మూర్తి.. ఆరుగురు ఇంజనీర్లతో కంపెనీని ప్రారంభించారు. అలా.. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు నివాసంగా మారింది. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండే ఆయన.. అహాన్ని, గర్వాన్ని తలకు ఎక్కించుకోలేదు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులను, మరెన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఆయన ఎందరికో దార్శనికుడు. అయితే, అంతటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెర ముందు చూపించేందుకు రంగం సిద్ధమైంది.

నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి.. జీవితాన్ని తెరపైకి ఎక్కించేందుకు దర్శకుడు అశ్వినీ అయ్యర్ తివారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ, మహవీర్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.



First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...