యూకేలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తేనెటీగల గుంపు రెండ్రోజుల పాటు ఓ కారును అంటిపెట్టుకొని గడిపాయి. ఆ కారుపైన తేనె పట్టు లేదు. ఆ కారు నిరుపయోగంగా పడివుంటే దాన్ని తేనెటీగలు ఆవాసంగా మార్చులేదు. మరి ఏం జరిగిందో తెలుసా..? కారులో చిక్కుకుపోయిన ఓ రాణి తేనెటీగ కోసం అవన్నీ 48 గంటల పాటు కాపలా ఉన్నాయి. లోపలున్న రాణి తేనెటీగకు ఏమైనా జరిగుతుందేమోనని రక్షణగా నిలిచాయి. ఇంతటీ ఆశ్చర్యకరమైన ఘంఘటన యూకేలోని వేల్స్లో జరిగింది. కారు యజమాని కరోల్ హోవర్త్ షాపింగ్ చేసేందుకు తన వెహికిల్‌ని ఓ షాపింగ్‌మాల్ ముందు పార్క్ చేసి లోపలి వెళ్లాడు. ఆ సమయంలో ఓ రాణి తేనెటీగ కారులో చిక్కుకుపోయింది. దాంతో దాదాపు మరో 20వేల తేనెటీగలు కారు వెనుక భాగంలోని బ్యానెట్, అద్దంపై వాలిపోయాయి. కారుపై గుంపుగా చేరిన తేనెటీగలను చూసిన యజమాని, స్థానికులు భయపడిపోయారు. ఎక్కడ అవి కుట్టి చంపుతాయోనన్న భయంతో వాటిని తరిమివేసే ప్రయత్నం చేశారు. అవి కారుని వదలకపోవడంతో కారు ఓనర్ తేనె పంపకందారుడి సాయంతో వాటిని కారుపై నుంచి తొలగించాడు.
కారుపై తిష్టవేసిన తేనెటీగల గుంపు..
అంతటితో కారు యజమానికి ఈ తేనెటీగల గుంపు నుంచి విముక్తి లభించలేదు. కారుని ఫాలో అయిన తేనెటిగీలు గుంపు మరుసటి రోజు కూడా కారు వెనుక భాగంపై కాపురం పెట్టాయి. దీంతో ఆశ్చర్యపోయిన కారు యజమాని చివరకు తన వాహనంలో చిక్కుకుపోయిన రాణి తేనెటీగ కోసమే ఇలా తేనెటీగల దండు తన కారును వదలడం లేదని తెలుసుకున్నాడు. లోపల చిక్కుకున్న రాణితేనెటీగను బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికి దాని జాడ దొరకలేదు.
రాణి తేనెటీగ కోసమే కాపలా..
తేనెటీగల ప్రత్యేకత ఏమిటంటే..తేనెటీగల సమూహం ఒకచోట నుంచి మరో ప్రదేశంలో పట్టు ఏర్పాటు చేసుకునేందుకు రాణితేనెటీగను ఫాలో అవుతాయి. అదే విధంగా మకాం మార్చుకునే క్రమంలోనే రాణితేనెటీగ కారులో చిక్కుకుపోవడంతో..మిగిలిన తేనెటీగలు దాని ఫాలో అయ్యాయి. తియ్యని తేనెను ఉత్పత్తి చేసే కీటకాలు సైతం వాటి పట్టును ఎవరైనా కదిలిస్తే దాడి చేస్తాయనే విషయం అందరికి తెలిసింది. కానీ వాటిలో ఒక్కటి దారి తప్పితే మిగిలిన తేనెటీగలు కూడా దాన్ని ఫాలో అవుతూ..ఇలా వెదుకులాట సాగిస్తాయని ఈఘటన రుజువు చేసింది.
ఐకమత్యాన్ని చాటుకున్నన కీటకాలు..
రాను రాను మనుషుల్లో ఐకమత్యం కరువైపోతోంది. కీటకాల్లో ఉన్న ఐకమత్యాన్ని చూసైన మనుషులు కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.