MP Farmer: దేశంలో మెడికల్ ఆక్సిజన్​ కొరత... ఈ రైతు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

చంపాలాల్​ గుర్జార్, ఆయన కుమార్తె

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా దేవియాన్​ గ్రామానికి చెందిన చంపాలాల్​ గుర్జార్​ అనే వ్యక్తి ఒక సాధారణ రైతు. తన కూతురు పెళ్లి సందర్భంగా రూ.2 లక్షలు విరాళం ఇవ్వాలని అతడు భావించాడు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ మొత్తాన్ని మెడికల్​ ఆక్సిజన్​ కోసం విరాళంగా అందించి...

  • Share this:
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్​లో కరోనా సెకండ్​వేవ్​ విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్​ లభించక అనేక చోట్ల రోగులు చనిపోతున్నారు. దీంతో అనేక మంది పారిశ్రామిక వేత్తలు మెడికల్​ ఆక్సిజన్ సిలిండర్ల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రోగుల దుస్థితి చూసి చలించిపోయిన కొంత మంది దాతలు ఎవరికి తోచినంత వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్​కు చెందిన ఒక సాధారణ రైతు కూడా రూ.2 లక్షలు విరాళంగా ప్రకటించి ఆదర్శంగా నిలిచాడు. తన కూతురి కోరిక మేరకు ఈ డబ్బును ఆక్సిజన్ సరఫరా కోసం దానం చేయడం విశేషం.

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా దేవియాన్​ గ్రామానికి చెందిన చంపాలాల్​ గుర్జార్​ అనే వ్యక్తి ఒక సాధారణ రైతు. తన కూతురు పెళ్లి సందర్భంగా రూ.2 లక్షలు విరాళం ఇవ్వాలని అతడు భావించాడు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఈ మొత్తాన్ని మెడికల్​ ఆక్సిజన్​ కోసం విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీనికి సంబంధించిన చెక్కును చంపాలాల్ నీముచ్​ జిల్లా కలెక్టర్​ అగర్వాల్​కు అందజేశాడు. తన విరాళంతో కొనుగోలు చేసిన రెండు మెడికల్​ ఆక్సిజన్​ సిలిండర్లలో ఒకటి జిల్లా ఆసుపత్రికి, మరొకటి అతడి గ్రామమైన జీరన్ తహసీల్‌కు అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరాడు.

కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు విరాళం:.
చంపాలాల్​ కుమార్తె అనిత వివాహం ఏప్రిల్​ 25న జరిగింది. తన పెళ్లి సందర్బంగా కరోనా బాధితుల కోసం విరాళం ఇవ్వాలని వధువు తండ్రిని కోరింది. దీంతో రూ. 2 లక్షల చెక్కును ఆ రైతు కలెక్టర్​కు అందజేశాడు. దీనిపై చంపాలాల్​ మాట్లాడుతూ "నా కుమార్తె వివాహం జీవితాంతం గుర్తుండేలా ఉండటానికి ఏదైనా మంచి పని చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు మెడికల్​ ఆక్సిజన్​ సకాలంలో లభించక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నన్ను కలిచివేశాయి. దీంతో నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న రూ.2 లక్షలను కలెక్టర్​కు అందజేశాను. తద్వారా, వచ్చే రెండు ఆక్సిజన్ సిలిండర్లను అత్యవసర స్థితిలో ఉన్న వారికి అందించి వారి ప్రాణాలు కాపాడవచ్చు." అని ఆయన చెప్పారు.

తన తండ్రి చేసిన గొప్ప పనితో ఎంతో సంతోషిస్తున్నట్లు అనిత అన్నారు. ప్రస్తుతం COVID-19 కేసుల పెరుగుతుండటంతో మెడికల్​ ఆక్సిజన్‌కు డిమాండ్​ పెరిగింది. దీంతో మావంతుగా కొంతమంది అవసరాలనైనా తీర్చవచ్చని ఈ విరాళం అందజేశామని తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published: