• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • A FARMER FROM BIHAR AMRESH SINGH IS TAKING A RISK AND GROWING THE WORLD COSTLIEST VEGETABLE SSR

Bihar Farmer: బీహార్‌లో ఈ రైతు పండిస్తున్న కూరగాయ ధర కిలో లక్ష రూపాయలు.. పెట్టుబడి ఎంత తక్కువో తెలిస్తే..

Bihar Farmer: బీహార్‌లో ఈ రైతు పండిస్తున్న కూరగాయ ధర కిలో లక్ష రూపాయలు.. పెట్టుబడి ఎంత తక్కువో తెలిస్తే..

‘హాప్ షూట్స్’ సాగు చేసిన పొలంలో అమ్రేష్ సింగ్

బీహార్‌కు చెందిన అమ్రేష్ సింగ్ ఒకరు. ఈ 38 ఏళ్ల రైతు సంప్రదాయ పంటలను సాగుచేసి విసిగివేసారి పోయాడు. దీంతో.. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన అమ్రేష్ సింగ్...

  • Share this:
    ఔరంగాబాద్: భారత్‌లో రైతాంగానికి ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదనేది అక్షర సత్యం. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు.. ఒకవేళ దేవుడి దయ వల్ల అన్నీ అనుకూలించి ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చేసరికి మద్దతు ధర లేకపోవడం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. పండించిన పంటను అమ్ముకున్నా పెట్టుబడులు, పైరుకు బలం మందులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు పోగా అంతంత మాత్రమే మిగులుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరం. తరతరాలుగా సాగు చేస్తున్న సంప్రదాయ పంటలు లాభసాటిగా లేకపోవడంతో కొందరు రైతులు వ్యవసాయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రిస్క్ అయినా ప్రత్యామ్నయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి వారిలో.. బీహార్‌కు చెందిన అమ్రేష్ సింగ్ ఒకరు. ఈ 38 ఏళ్ల రైతు సంప్రదాయ పంటలను సాగుచేసి విసిగివేసారి పోయాడు. దీంతో.. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్‌దిహ్ గ్రామానికి చెందిన అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ అనే కూరగాయలను సాగుచేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయలుగా ‘హాప్ షూట్స్’కు పేరుంది. ఈ కూరగాయల ధర మార్కెట్‌లో దొరికే వంకాయలు, టమాటాల్లా కిలో ధర పదుల్లో, వందల్లో ఉండదు. ‘హాప్ షూట్స్’ కూరగాయల కిలో ధర తక్కువలో తక్కువ రూ.85,000 ఉంటుంది. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంది.



    ఈ కూరగాయల సాగుకు తన సొంత పొలాన్ని సిద్ధం చేసిన అమ్రేష్ రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. పంట దిగుబడి కూడా ఆశించిన విధంగానే ఉంది. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగు మందులు వాడకుండా అమ్రేష్ ఈ పంటను పండించడం విశేషం. ‘హాఫ్ షూట్స్’ శాస్త్రీయ నామం హ్యుములస్ లుపులస్. ఈ కూరగాయల మొక్కలను వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ లాల్ పర్యవేక్షణలో పెంచుతున్నారు. అమ్రేష్ కూడా తన పొలంలో ఈ మొక్కలను నాటేందుకు అక్కడి నుంచే తెచ్చాడు. ఈ మొక్కకు పూచే పూలను ‘హాప్ కాన్స్’ అంటారు. బీర్ తయారీలో వీటిని వాడతారు.



    ఈ మొక్క కొమ్మలను పొడిగా చేసి మెడిసిన్ తయారీలో వినియోగిస్తారు. అమ్రేష్ సింగ్ ‘హాప్ షూట్స్’ పండిస్తున్న విషయాన్ని సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వ్యవసాయంలో ఓ కొత్త ప్రయత్నం చేసిన అమ్రేష్‌ను ఆమె అభినందించారు. అమ్రేష్ ప్రయత్నం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని, వ్యవసాయంలో రైతులు అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు వీలవుతుందని సుప్రియ ఆశించారు. ‘హాప్ షూట్స్’ సాగు చేసిన పొలంలో ఉన్న అమ్రేష్ ఫొటోలను సుప్రియా ట్విట్టర్‌లో పోస్ట్‌కు జత చేశారు. దీంతో.. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.



    హిమాచల్ ప్రదేశ్‌లో ఈ కూరగాయలను పండించే ప్రయత్నం చేశారని, కానీ.. సరైన మార్కెటింగ్ లేక రైతులు మళ్లీ సంప్రదాయ పంటల వైపే మొగ్గుచూపారని అమ్రేష్ చెప్పాడు. ‘హాప్ షూట్స్’ యాంటీ బాండీస్ ఏర్పడేందుకు కూడా తోడ్పడతాయని.. టీబీతో బాధపడుతున్నవారు ఈ కూరగాయలను తినడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను, లుకేమియా కణాలను ఈ కూరగాయలో ఉడే యాసిడ్స్ నిరోధించగలవని తేలింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు