హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Variety case : గేదెకు చేతబడి చేశారు.. పాలు ఇవ్వడం లేదు.. గేదెతో పాటు పోలీసు స్టేషన్లో రైతు..

Variety case : గేదెకు చేతబడి చేశారు.. పాలు ఇవ్వడం లేదు.. గేదెతో పాటు పోలీసు స్టేషన్లో రైతు..

స్టేషన్‌లో బాధితుడు

స్టేషన్‌లో బాధితుడు

Variety case : పోలీసు స్టేషన్‌కు ఓ వింత కేసు వచ్చింది.. ఓ రైతు తన బర్రెకు ఎవరో చేతబడి చేశారని.. అందుకే పాలు ఇవ్వలేదంటూ... ఏకంగా బర్రెను తీసుకుని పోలీస్ స్టేషణ్‌కు చేరుకున్నాడు..

ఇటివల పోలీసుల బాధ్యతతో పాటు ప్రమేయం కూడా పెరగడంతో ప్రతి చిన్న విషయం కూడా పోలీసు స్టేషన్‌కు చేరుతోంది.. అయితే ఇలా సాధారణంగా ప్రజా సంబంధమైన కేసులు ఎక్కువగా వస్తున్నాయి.... ఇలా స్టేషన్‌కు వచ్చే కేసులు ఒక్కోసారి వింతగా కూడా కనిపిస్తాయి.. ఇలా తిట్టుకోవడం, కొట్టుకోవడం కాకుండా ఓ కేసు వింత కేసు మధ్యప్రదేశ్ బింధ్‌ జిల్లా నాయ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌‌కు చేరింది. తన గేదె పాలివ్వడం లేదంటూ బాబూ లాల్‌ జాతవ్‌ (45) అనే రైతు పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా గేదెను స్టేషన్‌కు తీసుకువచ్చి ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులుగా తన గేదె పాలివ్వడం లేదని తెలిపాడు. బహుశా ఎవరైనా చేతబడి చేసి ఉంటారని గ్రామస్థులు చెప్పడంతో అతడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అదే విషయాన్ని పోలీసుకు చెప్పాడు.

అయితే పోలీసులు పట్టించుకోకుండా మాములుగా వ్యవహరించారు. దీంతో ఆ రైతు కాసేసు ఆగి మరోసారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు.. తన గేదె విషయం ఏదో ఒక పరిష్కారం చూపాలని ప్రాధేయపడ్డాడు. దీంతో పోలీసులు ఆ రైతుకు ఓ సలహా ఇచ్చారు. గేదె పాలు ఇవ్వకపోవడానికి కారణం తెలుసుకునేందుకు పశువుల ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయినా వినకపోవడంతో నచ్చజెప్పి పంపించారు. దీంతో గేదెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన మరునాడే అది పాలు ఇవ్వడం ప్రారంభించింది. తర్వాత మళ్లి స్టేషన్‌కు చేరుకుని ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు స్థానిక డీఎస్పీ అరవింద్ షా తెలిపారు.

ఇది చదవండి : ఏసి బస్సులో ఎగిసిన మంటలు.. ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు... ఇద్దరు మృతి..

First published:

Tags: Madya pradesh, Police station

ఉత్తమ కథలు