శరీర నిర్మాణాలు మనుషులందరికీ ఒకే విధంగా ఉంటాయి. వాళ్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా బతకగలరు. పాదాల విషయం వచ్చినప్పుడు ఈగ మరియు దోమ, బొద్దింక వీటికి రెండు కంటే ఎక్కువ కాళ్ళు ఉంటాయి. వీటికి వెన్నెముక ఉండదు. కొన్ని జంతువులు నాలుగు కాళ్ల తో నడుస్తాయి. మరికొన్ని రెండు కాళ్ళతో నడుస్తాయి. జీవనం మరియు ఆహారం కోసమే అలా పాదాలు నిర్మింపబడ్డాయి. మనుషులు రెండు కాళ్లపై నిలబడుతాడు. వెన్నుపాము సహాయంతో నడుస్తారు , పరిగెడతారు. సుమారు మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే రెండు కాళ్ళతో నడిచే మనుష్యజాతి ఆవిర్భవించింది. క్రమక్రమంగా వారి శరీర భాగాలు అభివృద్ధి చెందుతూ అలా అలా ఇప్పుడు ఉన్న ఆధునిక మానవులమే మనం. మన శరీర నిర్మాణం పరిణతి చెందింది. రెండు కాళ్లపై నిలబడే జాతి ఒక్క మనిషి జాతి మాత్రమే. ఆ తర్వాత జంతువుల్లో కంగారులు వస్తాయి. కంగారులు రెండు కాళ్లపై నిల్చోగలవు.
టర్కీలో వింత కుటుంబం..
నాలుగు కాళ్లపై జంతువుల్లా నడిచే వారిని చూశారా..? అవును ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా కుటుంబం అంతా నాలుగు కాళ్లపైనే నడుస్తుందట (family walks on all fours). అదేంటి మనిషికి రెండే కాళ్లు కదా అనుకుంటున్నారా? అవును రెండే కానీ, వాళ్లకు చేతులు కూడా కాళ్లే. రెండు చేతులు, రెండు కాళ్లతో నడుస్తారంట. ఈ వింత కుటుంబం టర్కీ (Turkey)లోని ఓ కుగ్రామంలో నివసిస్తోంది. ఈ కుటుంబానికి (family) చెందిన వారు నడవడానికి రెండు చేతులు, కాళ్లు (family walks on all fours) ఉపయోగిస్తారు. వీరిని చూస్తుంటే మానవ నాగరికత తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని, లక్షల ఏళ్లుగా మన వెనకాలే నడుస్తున్నారని అనిపిస్తుంది. ప్రారంభంలో, శాస్త్రవేత్తలు ఈ పరిస్థితి అర్ధం కాక పరిశోధనలు చేశారు. అయితే ఇప్పుడు దాని మిస్టరీని కనుగొన్నారు పరిశోధకులు.
ఉలాస్ కుటుంబం (Ulas family) చాలా కాలం పాటు ప్రపంచం నుంచి ఒంటరిగా ఉంది. 2005 కి ముందు, ఈ కుటుంబం గురించి ప్రజలకు తెలియదు. అప్పుడు ఒక టర్కిష్ ప్రొఫెసర్ రాసిన ఆర్టికల్ ఒక బ్రిటీష్ శాస్త్రవేత్త కంటపడిందంట. అది చదివిన ఆ శాస్త్రవేత్తకు షాక్ తగిలింది. ఈ పేపర్‌లో ఉలాస్ (ulas) కుటుంబం గురించి వివరించారు. ఇందులో ఈ కుటుంబం నాలుగు కాళ్లపై నడుస్తుందని (family walks on all fours) రాసి ఉంది. కుటుంబానికి యునర్ టాన్ సిండ్రోమ్ (Uner Tan Syndrome) ఉందని ఆ పత్రంలో పేర్కొన్నారు.
జన్యుపరమైన సమస్య అని..
బ్యాక్‌వర్డ్ ఎవల్యూషన్ (Backward Evolution)సిద్ధాంతం ఇక్కడ నుంచి వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ కుటుంబం(Family) పై ఆసక్తి చూపడం ప్రారంభించారు. అప్పుడు అది జన్యుపరమైన సమస్య (A genetic problem) అని తేలింది. ఇందులో రెండు పాదాలు బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులు చేతులు, కాళ్ల సాయంతో నడవడానికి (family walks on all fours) ఇదే కారణం.
ప్రపంచం ముందుకు వచ్చారు..
శాస్త్రవేత్తలు (Scientists) నివేదికలో చెప్పిన దాని ప్రకారం.. రెసిట్ మరియు హేటిస్ రెండు కాళ్లపై నడిచే ఇద్దరు వ్యక్తులు. కానీ అతని 19 మంది పిల్లలలో, ఐదుగురు చేతులు, కాళ్ళు ఉపయోగించి నడిచే వారు. ఇప్పుడు ఈ తోబుట్టువుల వయస్సు 25 నుండి 41 సంవత్సరాలు. వారు కూడా ప్రపంచం ముందుకు వచ్చారు. పూర్వం ప్రజలు వారిని చాలా హేళన చేసేవారు. గ్రామంలో నివసించడం వారికి కష్టంగా మారింది. ఉలాస్ కుటుంబానికి చెందిన ఈ పిల్లలు పాఠశాల ముఖం చూడలేకపోవడానికి కారణం ఇదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Turkey, Walking