• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • A DOG CRASHES WEATHER REPORT ON LIVE TV VIDEO GOES VIRAL GH SRD

Viral video: లైవ్ రిపోర్టింగ్‌ లో కుక్కపిల్ల హల్ చల్.. వైరల్ వీడియో

Viral video: లైవ్ రిపోర్టింగ్‌ లో కుక్కపిల్ల హల్ చల్.. వైరల్ వీడియో

Photo Credit : Youtube

Viral Video: ఒక టీవీ రిపోర్టర్ లైవ్‌కు అంతరాయం కలిగించిన కుక్కపిల్ల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అమెరికాలోని వర్జీనియాలో మంచు వాతావరణం గురించి రిపోర్టర్ వివరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Share this:
ఒక టీవీ రిపోర్టర్ లైవ్‌కు అంతరాయం కలిగించిన కుక్కపిల్ల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అమెరికాలోని వర్జీనియాలో మంచు వాతావరణం గురించి రిపోర్టర్ వివరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఫాక్స్‌5 టీవీ రిపోర్టర్ బాబ్ బర్నార్డ్ దాన్ని ఎత్తుకొని సందడి చేశారు. ఈ వీడియోను యూట్యూబ్‌లో లక్షలాదిమంది చూశారు. సోషల్ మీడియాలో ఈ క్లిప్పింగ్‌ వైరల్‌గా మారింది. ఉత్తర వర్జీనియాలో గత కొన్ని వారాలుగా విపరీతంగా మంచు కురుస్తోంది. అక్కడి పరిస్థితులపై గత శుక్రవారం బాబ్‌ లైవ్‌లో వివరిస్తున్నాడు. అదే సమయంలో సమీపంలోని ఇంటి నుంచి కుక్కపిల్ల అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది.దీంతో బాబ్ దాన్ని ఎత్తుకున్నాడు. "ఇప్పటి వరకు స్థానికులతో చర్చించిన విషయాలు మర్చిపోండి. ఇప్పుడు ఈ కుక్క గురించి తెలుసుకుందాం" అంటూ అతడు కాసేపు మాట్లాడాడు. దీంతో స్టూడియోలో ఉన్నవారు కూడా నవ్వుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపటికి అతడి వద్దకు ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఇంటి నుంచి కుక్కపిల్ల బయటకు వచ్చిందని ఆమె వివరించింది. దాని పేరు పిరోగి అని చెప్పింది. బయటకు వచ్చిన కుక్కను పట్టుకునేందుకు తన ఇంటి ఫెన్సింగ్ దూకి వచ్చానని తెలిపింది. ఇదంతా లైవ్ స్ట్రీమింగ్ అని తెలుసుకొని ఆమె కూడా ఆశ్చర్యపోయింది.

* పెరుగుతున్న వ్యూస్, లైక్స్
ఈ వీడియోను ఫాక్స్‌5 వార్తాసంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. దీన్ని ఇప్పటికే 11 లక్షల మందికి పైగా చూశారు. 8,000 లైక్‌లు, కొన్ని వందల కామెంట్లు వచ్చాయి. ‘నువ్వు వెదర్ రిపోర్ట్ కోసం వెళ్లావా? లేదా కుక్కతో ఆడుకోవడానికి వెళ్లావా?’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ‘మంచు వాతావరణంలో ఆడుకోవడానికి పిరోగి బయటకు వచ్చిందనుకుంటా’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. ‘నీ రిపోర్టింగ్‌కంటే కుక్కపిల్ల రిపోర్టింగ్ బాగుంది’ అని మరొక వ్యక్తి కామెంట్ రాశాడు. ఇంతకు ముందు కూడా లైవ్ స్ట్రీమింగ్‌లో వార్తలు చదువుతుండగా పెంపుడు కుక్కలు అంతరాయం కలిగించిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా గతంలో వైరల్ అయ్యాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Published by:Sridhar Reddy
First published: