Sleeping Hack: నిద్ర సరిగా పట్టాలంటే ఇలా పడుకోవాలట... వైరల్ అవుతున్న డాక్టర్ సూచన

ప్రతీకాత్మక చిత్రం

Viral: రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలైనా నిద్ర లేకపోతే మానసిక చురుకుదనం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుఖంగా నిద్ర పోవడానికి సులువైన మార్గాన్ని సూచిస్తున్నారు ఒక డాక్టర్.

  • News18
  • Last Updated :
  • Share this:
మితిమీరిన టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగం, ఒత్తిడితో కూడిన జీవనశైలి.. వంటివి వ్యక్తుల నిద్రపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధనల్లో తేలింది. రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలైనా నిద్ర లేకపోతే మానసిక చురుకుదనం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుఖంగా నిద్ర పోవడానికి సులువైన మార్గాన్ని సూచిస్తున్నారు ఒక డాక్టర్. నిద్ర గురించి ఆమె ఇచ్చిన సలహా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

డాక్టర్ జెస్ ఆండ్రేడ్ ఒక టిక్‌టాక్ వీడియోలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయం చెప్పారు. రాత్రి పూట నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించి పడుకోవాలని సూచించారు. దీనివల్ల గాఢనిద్ర పడుతుందని వివరించారు. తాను కూడా పడుకునేటప్పుడు తప్పకుండా కాళ్లకు సాక్స్ వేసుకుంటానని తెలిపారు. తన నిద్ర మెరుగుపడటానికి ఇది ఎంతగానో ఉపకరించిందని వెల్లడించారు.

సాక్స్‌ ఎందుకు..?

సాక్స్ ధరించడం వల్ల పాదాలు వేడెక్కుతాయని జెస్ చెబుతున్నారు. ‘పాదాలు వెడిక్కిన తరువాత శరీరాన్ని చల్లబరిచే రక్తనాళాలు తెరుకుంటాయి. ఫలితంగా శరీర౦ చల్లబడుతుంది. దీంతో నిద్రకు ఇదే సరైన సమయమని మెదడుకు సూచనలు అందుతాయి. అ౦దువల్ల తక్కువ సమయంలోనే గాఢమైన నిద్ర పడుతుంది’ అని ఆమె వీడియోలో వివరించారు.

sleeping tips, sleeping news, sleeping habbits, నిద్ర,కు టిప్స్, నిద్ర, మంచి నిద్ర, మంచి నిద్ర పట్టాలంటే,
ప్రతీకాత్మక చిత్రం


గతంలో పరిశోధన..

ఈ విషయాన్ని తాను కొత్తగా కనుగొనలేదని జెస్ తెలిపారు. నిద్ర నాణ్యతపై ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చేసిన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించిందన్నారు. దీన్ని 2006లో ఫిజికల్ బిహేవియర్ అనే జర్నల్‌లో ప్రచురించారని చెప్పారు. ఆ పరిశోధన పత్రంలో తన సలహాకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. డాక్టర్ జెస్ సలహాను కొంతమంది ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం నమ్మశక్యంగా లేదని ఒక యూజర్ కామెంట్ పెట్టారు. సాక్స్ వేసుకుంటే తనకు వచ్చే నిద్ర సైతం పోతుందని మరో వ్యక్తి రాశాడు.
Published by:Srinivas Munigala
First published: