Viral Video: రైల్వే క్రాసింగ్ దగ్గర షాకింగ్ ఘటన.. రైలొస్తుంటే ఈ యువతి ఏం చేసిందో చూడండి..

వీడియోలోని దృశ్యం

మధ్యప్రదేశ్‌లో ఓ ఆటో డ్రైవర్ చేసిన సాయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సాటి మనిషి ఆపదలో ఉంటే ఆ ఆటో డ్రైవర్ సత్వరమే స్పందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర గేటు పడింది.

  • Share this:
    బీతల్: మధ్యప్రదేశ్‌లో ఓ ఆటో డ్రైవర్ చేసిన సాయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సాటి మనిషి ఆపదలో ఉంటే ఆ ఆటో డ్రైవర్ సత్వరమే స్పందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర గేటు పడింది. కొద్దిసేపట్లో రైలు రాబోతోంది. గేటు పడటంతో ఆటోలు, ఇతర వాహనాలు నిలిచి ఉన్నాయి. ఇంతలో ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న ఓ మహిళ అందరూ చూస్తుండగా రైల్వే గేటు పడి ఉన్నప్పటికీ పట్టాల మీదకు వెళ్లి నిల్చుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుందని గమనించిన ఓ ఆటో డ్రైవర్ ఆమెను కాపాడేందుకు వెంటనే హుటాహుటిన పట్టాల మీదకు వెళ్లాడు. చచ్చిపోతావని.. రావాలని కోరాడు. ఇంతలో ట్రైన్ వస్తున్న శబ్దం వినిపించింది.

    ఆమె వినిపించుకోకుండా తాను చనిపోవాలనుకుంటున్నానని.. తనను వదిలేయాలని చెప్పడంతో.. ఆ ఆటో డ్రైవర్ బలవంతంగా ఆమెను చేయి పట్టుకుని పక్కకు లాక్కొచ్చాడు. వాళ్లిద్దరూ పట్టాల పక్కకు వచ్చిన కొద్దిసేపటికే రైలు వెళ్లింది. త్రుటిలో ఆ యువతికి ప్రాణాపాయం తప్పింది. తనను ఎందుకు కాపాడారని.. తాను చనిపోతానని ఆ యువతి చెప్పడంతో అక్కడున్న వారు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగం రాకపోవడంతో ఆ యువతి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. ఆ యువతిని కాపాడిన ఆటో డ్రైవర్‌ను మొహ్సిన్‌గా గుర్తించారు. అతని ధైర్యానికి, సాటి వాళ్లు ఆపదలో ఉంటే మనకెందుకులే అనుకోకుండా కాపాడేందుకు చూపిన చొరవను నెటిజన్లు అభినందిస్తున్నారు.





    ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అంకిత శర్మ ఐపీఎస్‌తో పాటు పలువురు ప్రముఖులు స్పందించారు. తక్షణమే స్పందించిన ఆ ఆటో డ్రైవర్‌ను ప్రశంసిస్తూనే.. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని.. ఇలా ఎవరూ చేయవద్దని యువతకు సూచిస్తున్నారు. కళ్ల ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మనకెందుకు వచ్చిన తలనొప్పిలే అనుకుని పట్టించుకోకుండా వెళ్లిపోతున్న జనం ఉన్న ఈ సమాజంలో ఈ ఆటో డ్రైవర్ లాంటి వాళ్లు ఉండటం మానవత్వం ఇంకా ఏ మూలనో బతికే ఉందన్న ఆశలను చిగురింపజేస్తోంది.
    Published by:Sambasiva Reddy
    First published: