Disability Is Lost: ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచింది.. అంగవైకల్యంతో 2,800 కిలోమీటర్లు సైకిల్ యాత్ర..

సికిల్ యాత్రలో యువకుడు

Disability Is Lost: అతని మదినిండా దేశ భక్తి నిండి ఉంది. ఏదైనా సాధించి ప్రత్యేకను సంతరించుకోవాలన్న సంకల్పం అతనిది. అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచింది. వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ సమైఖ్యతా స్పూర్తిని చాటిచెప్పేందుకు ఉక్కు సంకల్పంతో 2,800 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర శ్రీకారం చుట్టాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (K. Lenin, News18, Adilabad)

  అతని మదినిండా దేశ భక్తి నిండి ఉంది. ఏదైనా సాధించి ప్రత్యేకను సంతరించుకోవాలన్న సంకల్పం అతనిది. అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచింది. వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ సమైఖ్యతా స్పూర్తిని చాటిచెప్పేందుకు ఉక్కు సంకల్పంతో 2,800 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర శ్రీకారం చుట్టాడు. అత్యంత ధైర్యసాహాలతో సైకిల్ యాత్రలో పాలొంటున్న వ్యక్తి పేరు అజయ్ కుమార్ సింగ్. అతను బీహార్ రాష్ట్రానికి చెందిన అజయ్ కుమార్ సింగ్ సీఆర్పీఎఫ్ఫ్ లో కీలకమైన అధికారిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అయితే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల విధుల్లో భాగంగా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బందోబస్తు విధుల్లో ఉండగా జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఎడమ కాలు తొడ భాగం వరకు పూర్తిగా కోల్పోయాడు.

  Petrol Bunk Incident: నన్నే పెట్రోల్ డబ్బులు అడుగుతావా అంటూ.. ఓ వ్యక్తి పక్కనే ఉన్న రాళ్లను తీసుకొని..


  అయినా మనోస్థైర్యాన్ని కోల్పోకుండా కృత్రిమ కాలును అమర్చుకొని దాని సహాయంలో విధుల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సిఆర్ పిఎఫ్ కి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్, హైదరాబాద్ సిడిఈ దివ్యాంగుల విభాగంలో ఇన్స్ పెక్టర్ హోదాలో పనిచేస్తున్నాడు. బాంబు పేలుడు సంఘటన తర్వాత ఏమాత్రం కృంగిపోకుండా, జీవితంలో ఏదైనా సాధించి ప్రత్యేకతను నిలుపుకోవాలని తలచాడు. అందుకే ఎన్నో సవాళ్ళతో కూడిన సైకిల్ యాత్రను ఎంచుకున్నాడు. గతంలో బృందంతో కలిసి 2016 నుంచి అటారీ నుంచి ఢిల్లీ, సిమ్లా నుండి మనాలి, సబర్మతి నుండి డిల్లీ, ఢిల్లీ నుండి ముంబాయి, హైదరాబాద్ నుండి తిరుపతి, డెహ్రాడున్ నుండి మన్నాపాడు(బద్రీనాథ్) వరకు ఇలా అనేక పర్యాయాలు వేలాది కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు.

  PM Kisan Credit Card: రైతులకు శుభవార్త.. ఇక నుంచి వాటి కోసం బ్యాంక్ కు వెళ్లకుండానే.. పూర్తి వివరాలివే..


  ప్రస్తుతం ప్రస్తుతం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"లో భాగంగా కన్యాకుమారి నుండి డిల్లీలోని రాజ్ ఘాట్ వరకు సుమారు 2800 కిలోమీటర్లు మేర చేపట్టిన సైకిల్ యాత్రలో పాల్గొంటున్నాడు. కాగా వీరి సైకిల్ యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించింది. మార్గ మధ్యలో నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లో ఈ సైకిల్ యాత్ర బృందానికి ఘనస్వాగతం లభించింది. అక్కడి నుండి ఈ యాత్ర కొనసాగి సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది.

  Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రయాణికులు మృతి.. మరో ఐదుగురి పరిస్థితి..


  రాత్రికి జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో బసచేసి సోమవారం ఉదయం జాతీయ రహదారి గుండా మహారాష్ట్రలో విజయవంతంగా ప్రవేశించనున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ధైర్యసాహసాలతో సైకిల్ యాత్రలో పాల్గొంటున్న ఆ అధికారిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్పూర్తితో మరిన్ని సాహసాలు చేపట్టి దేశ ప్రతిష్టలను, కీర్తిని నలుదిశలా వ్యాపించే విధంగా స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
  Published by:Veera Babu
  First published: