• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • A DELIVERY PERSON CATCHES A TWO YEAR OLD GIRL FALLING FROM A 12TH STOREY BALCONY IN VIETNAM VIDEO GOES VIRAL SRD

Viral Video : ఆడు మగాడ్రా బుజ్జి.. 12వ అంత‌స్తు నుంచి పడ్డ చిన్నారిని కాపాడిన డెలివ‌రీ బాయ్‌..

Viral Video : ఆడు మగాడ్రా బుజ్జి.. 12వ అంత‌స్తు నుంచి పడ్డ చిన్నారిని కాపాడిన డెలివ‌రీ బాయ్‌..

12వ అంత‌స్తు నుంచి పడ్డ చిన్నారిని కాపాడిన డెలివ‌రీ బాయ్‌..(Photo Credit : Twitter)

Viral Video : ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి ఆ చిన్నారి బతికింది.

  • Share this:
    ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి.. భూమ్మీద ఇంకా నూకలుండబట్టి ఆ చిన్నారి బతికింది. లేకపోతే మృత్యువు ఆ రెండేళ్ల చిన్నారిని కబళించింది. ఓ పాప ప్రాణాన్ని సాహాసోపేతంగా కాపాడి రియల్ హీరో అన్పించుకున్నాడు ఓ డెలివరీ బాయ్. వివరాల్లోకెళితే.. ఏకంగా 12వ అంత‌స్తు నుంచి ప‌డిన ఓ చిన్నారిని కింద ఉన్న‌ ఓ డెలివ‌రీ బాయ్ ఒడిసి ప‌ట్టుకున్నాడు. దీంతో ఓ చిన్న గాయంతో ఆ చిన్నారి బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వియ‌త్నాంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బాల్క‌నీలో ఆడుకుంటున్న ఆ చిన్నారి ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద ప‌డిపోయింది. అదే స‌మ‌యంలో అక్క‌డికి ఓ డెలివ‌రీ ఇవ్వ‌డానికి వ‌చ్చిన ఎన్‌గుయెన్ మ‌న్ అనే వ్య‌క్తి వ‌చ్చాడు. అప్ప‌టికి కాసేప‌టి ముందు నుంచే అత‌నికి ఆ చిన్నారి ఏడుపు వినిపించింది.

    చుట్టూ ఉన్న వాళ్ల అరుపులు కూడా వినిపించ‌డంతో అత‌డు త‌న ట్ర‌క్ నుంచి బ‌య‌ట‌కు దిగి చూడ‌గా.. ఆ చిన్నారి బాల్క‌నీలో క‌నిపించింది. ఆమె కింద ప‌డే లోపే ఆ బిల్డింగ్ బ‌య‌ట ఉన్న ఆరు అడుగుల ఎత్తు గోడ ఎక్కేశాడు. అయితే చివ‌రి క్ష‌ణంలో అత‌ని కాలు జార‌డంతో కింద ప‌డ‌బోయినా ఎలాగోలా ఆ చిన్నారిని ప‌ట్టుకోగ‌లిగాడు.


    దీంతో ఆ పాప కాలికి చిన్న గాయం కాగా ఆమెను ప‌ట్టుకున్న ఎన్‌గుయెన్ చేతిలో ఎముక కాస్త విరిగింది. అయితే ఆ పాప‌ను ర‌క్షించిన అత‌డు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హీరో అయిపోయాడు. ప్రతి ఒక్కరూ ఆ డెలివరీ బాయ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. తాను హీరోను కాద‌ని, మంచి చేయ‌డ‌మే త‌న ప‌ని అని ఆ త‌ర్వాత ఎన్‌గుయెన్ చెప్పాడు. ప్రస్తుతం చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అయింది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు