పోలీస్ అంటే పిల్లనివ్వడం లేదు.. ఈ ఉద్యోగం వద్దు : కమిషనర్‌కు కానిస్టేబుల్ లేఖ

ఇంజనీరింగ్ చదువుకున్న తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న ఇష్టంతో కానిస్టేబుల్ అయ్యానని.. కానీ ఆ పేరు చెబితే ఎవరూ పిల్లను కూడా ఇవ్వడం లేదని రాజీనామా లేఖలో ప్రతాప్ తెలిపాడు.

news18-telugu
Updated: September 12, 2019, 4:49 PM IST
పోలీస్ అంటే పిల్లనివ్వడం లేదు.. ఈ ఉద్యోగం వద్దు : కమిషనర్‌కు కానిస్టేబుల్ లేఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పోలీస్ అని చెబితే చాలు.. వచ్చిన సంబంధాలు వచ్చినట్టే పోతున్నాయని ఆవేదన చెందిన ఓ కానిస్టేబుల్ ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు పంపించారు.సిద్దాంతి ప్రతాప్ అనే కానిస్టేబుల్ రాసిన ఆ లేఖలో.. పోలీసులంటే అమ్మాయిలు ఇష్టపడటం లేదని.. దాంతో పెళ్లి సంబంధాలు కుదరడం లేదని పేర్కొన్నాడు. ఈ నెల 7న ప్రతాప్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సార్.. నేను చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. ఇంట్లో నాకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.ఇటీవల పెళ్లిచూపులకు వెళ్లగా.. కానిస్టేబుల్ అని చెప్పగానే యువతి తిరస్కరించింది. కానిస్టేబుల్ అంటే 24గంటలు పని ఉంటుంది..ఈ సంబంధం వద్దని చెప్పేసింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.
సిద్దాంతి ప్రతాప్,పోలీస్ కానిస్టేబుల్


పోలీస్ కమిషనర్‌కి లేఖ


ఇంజనీరింగ్ చదువుకున్న తాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న ఇష్టంతో కానిస్టేబుల్ అయ్యానని.. కానీ ఆ పేరు చెబితే ఎవరూ పిల్లను కూడా ఇవ్వడం లేదని రాజీనామా లేఖలో ప్రతాప్ తెలిపాడు. అంతేకాదు, పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నవారికి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్స్ లభించడం లేదన్నారు. 20ఏళ్లు పనిచేసినా కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్‌గానే ఉండిపోవాల్సి వస్తోందని అన్నారు.ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్వీస్ ప్రకారం ప్రమోషన్స్ ఉంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>