హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘వీడెక్కడి మొగుడండీ బాబు?’ భార్యతో పడకపోతే 14 ఏళ్లుగా ఇలా కూడా చేస్తారా ?

‘వీడెక్కడి మొగుడండీ బాబు?’ భార్యతో పడకపోతే 14 ఏళ్లుగా ఇలా కూడా చేస్తారా ?

2008లో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బీజింగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ సాయంతో అక్కడే వంట చేసుకుని తింటాడు.

2008లో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బీజింగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ సాయంతో అక్కడే వంట చేసుకుని తింటాడు.

2008లో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బీజింగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ సాయంతో అక్కడే వంట చేసుకుని తింటాడు.

  భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు సర్వసాధారణం. భర్తపై అలిగి భార్య పుట్టింటికి వెళ్లడం... భర్త వెళ్లి తిరిగి ఆమెను తీసుకురావడం మనం చాలా సందర్భాల్లో చూశాం విన్నాం. అలాగే భర్తలు కూడా భార్యల ప్రవర్తనతో విసిగి.. ఏ బార్‌కు రెస్టారెంట్‌కో వెళ్తారు. లేదంటే ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి... తమ బాధను షేర్ చేసుకుంటుంటారు. అయితే ఓ భర్త మాత్రం భార్యతో గొడవల కారణంగా.. కుటుంబానికి దూరమయ్యాడు. అయితే ఆయన ఎవరి ఇంటికో వెళ్లలేదు. ఉంటున్న ఇంటిని భార్యా పిల్లల్ని వదిలి తన మకాం.. ఎయిర్ పోర్టుకు మార్చేశాడు. ఇలా ఒకటి రెండో కాదు.. 14 ఏళ్లుగా అతడు ఎయిర్ పోర్టులోనే తన నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ ఘటన చైనాలోని బీజింగ్‌లో జరిగింది.

  వివరాల్లోకి వెళ్తే... చైనాలోని బీజింగ్‌కు చెందిన వీ జియాంగువో వయసు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు. ఒకప్పుడు వాంగ్‌జింగ్‌లోని తన సొంత ఇంట్లో ఉండేవాడు. అతనికి ఓ కుటుంబం కూడా ఉంది. తన కుటుంబసభ్యులు అందరితో కలిసి సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా జీవించేవాడు. అయితే జియాంగువో 40 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతడు డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఆ బాధతో తాగడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు మద్యం, సిగరెట్లకు బానిసైపోయాడు. జియాంగువో పద్ధతి అతడి భార్య, కుటుంబ సభ్యులకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో అతనికి కొన్ని కండిషన్లు పెట్టారు.ఇంట్లో ఉండాలంటే మందు, సిగరెట్‌ మానేయాల్సిందేనని తెగేసి చెప్పారు. అయితే ఆ రెండు అలవాట్లు మానే ఆలోచన జియాంగువోకు ఏమాత్రం లేదు. అందుకే అతడు ఇంటిని కుటుంబాన్ని కాదనుకున్నాడు. సొంతింటి నుంచి బయటకు వచ్చి తన మకాం మార్చేశాడు. సూట్‌ కేసు సర్దుకుని బీజింగ్‌ ఎయిర్ పోర్టుకు బయలుదేరాడు.

  2008లో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బీజింగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతను మూడు టెర్మినల్‌లను కలిగి ఉన్న బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోనే నివసిస్తున్నాడు. జియాంగువో టెర్మినల్ 2లో ఉంటున్నాడు. అయితే ఎయిర్ పోర్టులో ఎందుకు ఉంటున్నావు అని మీడియా అడిగిన ప్రశ్నకు జియాంగువో ఇలా సమాధానం ఇస్తున్నాడు. ‘‘నేను ఇంటికి వెళ్లాలంటే ఇప్పుడైనా వెళ్లగలను. కానీ వెళ్లను. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ లేదు. నేను ఇంట్లోనే ఉండాలంటే నాకు వచ్చే పింఛను మొత్తాన్ని వారికి ఇచ్చేయాలంట. అలా చేస్తే మందు, సిగరెట్లను నేను ఎలా కొనుక్కోగలను?’’ అని అంటున్నాడు జియాంగువో. దీంతో 14 ఏళ్లుగా హ్యాపీగా ఎయిర్ పోర్టులోనే కాలం వెళ్లదీస్తున్నాడు. అధునాతన వసతులు ఉన్న బీజింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్స్‌లోనే తిరుగుతూ టైం గడిపేస్తున్నాడు. జియాంగువో తన మొబైల్‌ కిచెన్‌ సామగ్రి, దుప్పట్లు, దుస్తుల్ని ఓ రెండు సూట్‌కేసుల్లో పెట్టుకుంటాడు. ఒక చిన్న ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ సాయంతో అక్కడే వంట చేసుకుని తింటాడు.

  అయితే జియాంగువోను ఎయిర్‌పోర్ట్‌ నుంచి పంపించేందుకు అక్కడి భద్రతా సిబ్బంది చాలాసార్లు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో అతడి ఇంటి వద్ద విడిచిపెట్టినా.. వెంటనే తిరిగి అక్కడికి చేరుకుంటాడని అధికారులు చెబుతున్నారు. అయితే ఎయిర్ పోర్టులో ఇలా ఏళ్లుగా నివసిస్తున్న వారు జియాంగువో ఒక్కడే కాదు. మరికొందరు కూడా ఉన్నారు. ఇరాన్‌కు చెందిన మెహ్రాన్ కరీమి నాస్సేరీ అనే శరణార్థి పారిస్ చార్లెస్ డి గల్లెలో టెర్మినల్‌ వన్‌లో 2006 నుంచి ఆసుపత్రిలో చేరే వరకు 18 సంవత్సరాలు నివసించాడు. బ్రిటీష్ అధికారులు అతన్ని బ్రిటన్‌కు అనుమతించకపోవడంతో అతను ఎయిర్ పోర్టులోనే నివసించవలసి వచ్చింది ఫ్రెంచ్ కూడా అతని ప్రవేశాన్ని తిరస్కరించింది.

  First published:

  Tags: China, International news, Wife and husband

  ఉత్తమ కథలు