Viral: పెళ్లి వేడుకలో 60 కిలోల బంగారు ఆభరణాలు ధరించిన వధువు.. ఫోటోలు వైరల్..

బంగారు ఆభరణాలు ధరించిన వధువు

పెళ్లి రోజున వధువు పట్టు చీరతో పాటు దగదగ మెరిసే బంగారు ఆభరణాలు ధరిస్తుంది. తన జీవితాంతం గుర్తుండిపోయేలా కుందనపు బొమ్మలా తయారవుతుంది. సాధారణంగా ఏ పెళ్లికూతురు అయినా హారాలు, నెక్లెస్‌లు, గాజులు, పాపిటబిళ్ల, వడ్డాణం వంటి బంగారు నగలు ఒక్కోటి చొప్పున ధరిస్తుంది.

  • Share this:
పెళ్లి రోజున వధువు పట్టు చీరతో పాటు దగదగ మెరిసే బంగారు ఆభరణాలు ధరిస్తుంది. తన జీవితాంతం గుర్తుండిపోయేలా కుందనపు బొమ్మలా తయారవుతుంది. సాధారణంగా ఏ పెళ్లికూతురు అయినా హారాలు, నెక్లెస్‌లు, గాజులు, పాపిటబిళ్ల, వడ్డాణం వంటి బంగారు నగలు ఒక్కోటి చొప్పున ధరిస్తుంది. కానీ చైనాలోని హుబే ప్రావిన్స్‌కి చెందిన ఒక పెళ్లికూతురు మాత్రం ఏకంగా 60 బంగారు నెక్లెస్‌లు పెట్టుకుంది. గమ్మత్తేమిటంటే.. వధువు ధరించిన బంగారు ఆభరణాలన్నీ కూడా భర్త కట్నంగా ఇచ్చిన నగలేనట. ఆ నెక్లెస్‌లు 10 గ్రాములో లేక 20 గ్రాములో బరువు ఉంటాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ 60 బంగారు నెక్లెస్‌ల బరువు అక్షరాల 60 కిలోలు ఉంటుందట. అంటే ఒక్కో నెక్లెస్‌ బరువు ఓ కేజీ అన్నమాట. ఇంత బరువైన నగలు ధరించిన వధువు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

చైనా పెళ్లికూతురు తన వెడ్డింగ్ రోజు సెప్టెంబర్ 30న చాలా బంగారు ఆభరణాలు ధరించి కనిపించింది. ఆమె ఒంటినిండా బంగారు నగలు కనిపించడంతో అక్కడికి విచ్చేసిన బంధుమిత్రులు ఆశ్చర్యపోయారు. శుభకార్యం రోజు శుభప్రదంగా నాలుగైదు నగలు ధరిస్తారు కానీ ఈ వధువు ఏంటి.. ఒంటినిండా ఇలా నగలు కప్పుకొని వచ్చేసింది అంటూ వారందరూ నోరెళ్లబెట్టారు. అయితే, ఈ వధువు 60 కిలోల బంగారం ఒంటిపై ఉండటంతో నడవలేక చాలా ఇబ్బంది పడినట్లు కనిపించింది. అడుగుతీసి అడుగు వేయలేకపోవడంతో ఆమెకు వరుడు సహాయం చేయాల్సి వచ్చింది. వధువు వైట్ డ్రెస్ ధరించి చేతుల్లో గులాబీల ఫ్లవర్ బొకే పట్టుకొని దర్శనమిచ్చింది.

గమ్మత్తేమిటంటే.. వధువు ధరించిన బంగారు ఆభరణాలన్నీ కూడా భర్త కట్నంగా ఇచ్చిన నగలేనట. అతగాడు ఇచ్చిన 60 బంగారు నెక్లెస్‌ల్లో ఒక్కొక్కటి ఒక కిలోగ్రాము బరువు ఉంటుంది. ఈ నెక్లెస్‌లు చాలదన్నట్టు వధువు తన రెండు చేతులకు రెండు భారీ బంగారు గాజులు కూడా ధరించింది. అవి వరుడి కుటుంబం వధువుకి బహుమతులుగా ఇచ్చారట. ఈ రేంజ్ లో బహుమతులు ఇచ్చిన వరుడు పెద్ద కోటీశ్వరుడని అక్కడి వారంతా గుసగుసలాడుకుంటున్నారు. ధనిక కుటుంబంలో పెళ్లంటే ఇలానే ఉండాలి అన్నట్టు అబ్బాయి కుటుంబం ఇచ్చిన బహుమతులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

ఇది కూడా చదవండి: Explained: మీ ఇంట్లో పిల్లలు తినేటప్పుడు టీవీ లేదా మొబైల్‌ గానీ చూస్తున్నారా.. ఇది తెలిస్తే వెంటనే మాన్పించేస్తారు..!

ప్రపంచ దేశాల్లో చాలా మంది బంగారం అదృష్టం, హోదాకు ప్రతీకగా పరిగణిస్తారు. శుభకార్యం నాడు బంగారం ధరిస్తే దుష్టశక్తులు, దురదృష్టాలను దరిచేరవని నమ్ముతుంటారు. అలాగే ప్రజలు శుభకార్యాల సందర్భంగా భారీ నెక్లెస్‌లు ధరించి లేదా బహుమతులుగా ఇచ్చి తమ హోదా చూపిస్తుంటారు. కానీ మరీ ఎక్కువగా బహుమతులు ఇవ్వడంతో చైనా వధువు అవి మోయలేక చాలా ఇబ్బంది పడిపోయింది. ఆమె నానా తంటాలు పడుతుంటే వివాహానికి విచ్చేసిన అతిథులు జాలిపడ్డారు. ఒక అతిథి సహాయం చేయమంటారా అని కూడా అడిగారట. అందుకు ఆమె చిరునవ్వు నవ్వి పెళ్లి ఆచారాలు కొనసాగిస్తానని చెప్పారట. కాగా ఈ వధువు ధరించిన బంగారు నెక్లెస్‌లు, గాజులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Published by:Sambasiva Reddy
First published: