A BRIDE DOING PUSH UPS WHILE WEARING A HEAVY LEHENGA VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA GH SSR
Viral Video: వెడ్డింగ్ డ్రెస్లో పెళ్లి కూతురు పుషప్స్ చేస్తే ఎట్టుంటాదో తెలుసా.. ఈ వీడియోలో చూసేయండి..
వీడియోలోని దృశ్యాలు
పెళ్లిళ్లలో జరుగుతున్న కొన్ని ఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కొన్ని సరదా సంగతులు.. మరికొన్ని అరుదైన విషయాలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తక్కువ మంది అతిథుల మధ్యే వివాహాలు జరుగుతున్నా.. కొన్ని ఘటనలు మాత్రం అందరినీ ఆకర్షిస్తున్నాయి.
పెళ్లిళ్లలో జరుగుతున్న కొన్ని ఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కొన్ని సరదా సంగతులు.. మరికొన్ని అరుదైన విషయాలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తక్కువ మంది అతిథుల మధ్యే వివాహాలు జరుగుతున్నా.. కొన్ని ఘటనలు మాత్రం అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ పెళ్లి కూతురు.. వివాహ వేడుకలో పుషప్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సాధారణంగా పుషప్స్ చేయాలంటేనే కాస్త కష్టంతో కూడుకున్న పని. తేలికైన దుస్తులు ధరించి ఉదయం వేళ వ్యాయామంలో చేస్తారు. కానీ ఓ పెళ్లి కూతురు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతో బరువుగా ఉండే లెహంగాతో పాటు ఆభణాలను ధరించి అలవోకగా పుషప్స్ చేసింది. పెళ్లి మండపంలోనే వధువు చేసిన విన్యాసంతో అందరూ ఆశ్చర్యపోయారు. అరుస్తూ ప్రోత్సహించారు. ఈ అరుదైన వీడియోను అనా అరోరా అనే డైటిషియన్, మోడల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. పెళ్లి వేళ ఆ వధువు చేసిన పుషప్స్కు నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేశారు.
ఫిట్నెస్ను కాపాడుకోవడం ముఖ్యమని ఆమె సందేశమిచ్చిందని కొందరు నెటిజన్లు ఆ వధువును ప్రశంసించారు. వ్యాయామం చేసేందుకు ఈ వీడియో స్ఫూర్తిగా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తంగా పెళ్లికూతురు పుషప్స్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు లైక్లు, కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే 5లక్షలకు పైగా లైక్లు రాగా.. కామెంట్లు వేలాదిగా వస్తున్నాయి. ముఖ్యంగా లెహంగా, ఆభరాణాలు ధరించి పుషప్స్ చేసిన ఆమెను ఎంతో మంది నెటిజన్లు అభినందించారు.
కాగా వివాహాల వేళ అరుదైన విషయాలు జరగడం సాధారణంగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ దునియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇటీవలే ఓ వీడియో సైతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. పెళ్లి కూతురే.. వరుడిని రెడీ చేస్తున్న వీడియో అది. పెళ్లి రోజున అందంగా తయారైన వధువు.. ఎంతో ప్రేమగా తనకు కాబోయే భర్తను తయారు చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షించింది. చాలా మంది హృదయాలను కొల్లగొట్టింది. “ఎంతో ప్రేమగా మిమ్మల్ని రెడీ చేసే పెళ్లి కూతురును అన్వేషించుకోండి. ఇదిగో అద్భుతమైన జంట” అంటూ ఓ యూజర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు లైక్ల వర్షం కురిపించారు. కాగా కరోనా ప్రభావం ఉండడంతో విమానంలో పెళ్లి చేసుకున్న ఓ జంట వీడియోలు కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అప్పట్లో అదో సోషల్ మీడియా సంచలనంగా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.