హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dating Resume: డేటింగ్​ కోసం అమ్మాయికి రెజ్యూమ్​ పంపిన కుర్రాడు.. ఖచ్చితంగా వెళ్లమంటున్న నెటిజన్లు

Dating Resume: డేటింగ్​ కోసం అమ్మాయికి రెజ్యూమ్​ పంపిన కుర్రాడు.. ఖచ్చితంగా వెళ్లమంటున్న నెటిజన్లు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తనతో డేటింగ్​కి రమ్మని అమ్మాయికి ఓ స్వీట్ రెజ్యూమ్ పెట్టాడు కుర్రాడు. నాలుగేళ్లుగా నువ్వు నాకు తెలుసని, అలా సరదాగా డేట్​కి వెళదామని ప్రపోజల్ పెట్టాడు యువకుడు. ఈ రెజ్యూమ్​ను సదరు అమ్మాయిగారు సోషల్​ మీడియా(social media) లో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

  రెజ్యూమ్(Resume)​.. అంటే తెలుసుగా.. మనకు ఉద్యోగం(job) కావాలంటే ఏదో కంపెనీకి సిద్ధం చేసి పంపుతాం. ఎందుకంటే మన రెజ్యూమే మనల్ని ఆ కంపెనీకి పరిచయం చేస్తుంది. మనలోని టాలెంట్​ను తెలియజేస్తుంది. దాదాపు సగానికి పైగా కంపెనీలు మన రెజ్యూమేలో ఉన్న విషయాల ఆధారంగానే మనల్ని సంప్రదిస్తాయి. అందుకే అభ్యర్థులు కూడా రెజ్యూమ్​లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇంతకీ ఈ రెజ్యూమ్​ గురించి ఇప్పుడెందుకు చెబుతున్నా.. అంటారా..? అమెరికా(America)లోని ఓ అబ్బాయి ఇలాంటి ఆసక్తికర రెజ్యూమ్​ ఒకటి రెడీ చేశాడు. దీంట్లో వింత ఏంటి అంటారా? ఆ అబ్బాయి రెజ్యూమ్​ పంపింది డేటింగ్​ కోసమంటా. అవును మీరు విన్నది నిజమే ఓ అమ్మాయితో డేటింగ్​(Dating) కోసమే. తనతో డేటింగ్​కి రమ్మని తన క్లాస్​మేట్(classmate)కి ఓ స్వీట్​ రెజ్యూమ్​ పెట్టాడు మన కుర్రాడు. నాలుగేళ్లుగా నువ్వు నాకు తెలుసని, అలా సరదాగా డేట్​కి వెళదామని ప్రపోజల్​ పెట్టడు యువకుడు. ఈ రెజ్యూమ్​ను సదరు అమ్మాయిగారు సోషల్​మీడియా(social media) లో పెట్టడంతో తెగ వైరల్​ అవుతోంది. ఇంతకీ ఆ అబ్బాయి డైరెక్ట్​గా చెప్పకుండా​ రెజ్యూమ్​ ఎందుకు పెట్టాడు.?. ఎక్కడుంటాడో తెలుసుకుందాం.. పదండి..

  ఇప్పుడు సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. యువత కోసం డేటింగ్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎవరైనా అమ్మాయిని డేటింగ్‌కు పిలవాలంటే డేటింగ్ యాప్స్ సాయంతో ఆహ్వానించవచ్చు. ఐతే అమెరికాలోని కాలిఫోర్నియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి(student) కొత్త పంథాను ఎంచుకున్నాడు. శాన్ డియాగో యూనివర్శిటీలో చదువుతున్న జేమ్స్.  అదే యూనివర్శిటీకి చెందిన క్రిష్టిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు(loving). ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ పూర్తి కాబోతోంది. దీంతో హైరానా పడ్డ యువకుడు .. ఆమెను డేటింగ్‌కు ఆహ్వానించాలని(invite) ధైర్యం చేశాడు. ఓసారి తన కోరికని ఆమెకు వెలిబుచ్చాడు.

  ఐతే ఆ అమ్మాయి ఫన్నీగా అతనికి ఓ విషయం చెప్పింది. నిజంగా నన్ను డేటింగ్‌కు ఆహ్వానించాలనుకుంటే . . ఓ కవర్ లెటర్(letter) పంపించమని కోరింది. దీనికి జేమ్స్ ఏకంగా తన రెజ్యూమ్‌నే ఆ అమ్మాయికి పంపించాడు. రెజ్యూమ్‌లో తన హైట్, వెయిట్, చదువుతోపాటు , పాత గర్ల్ ఫ్రెండ్స్ వివరాలు కూడా పొందు పరిచాడు. అయితే జేమ్స్ పంపిన రెజ్యూమ్‌ను చూసి నవ్వుకున్న క్రిస్టినా.. దాన్ని యథాతథంగా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీన్ని ఒక వెరైటీగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. మరీ అంత స్వీట్​గా పంపినపుడు ఆ అబ్బాయికి ఒకరోజు ఇచ్చి తీరాల్సిందేనని నెటిజన్లు(netizens) ట్వీట్లు చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: America, Dating, Girl friend, Netizen, School boy, Viral tweet

  ఉత్తమ కథలు