తొండం బదులు నోటితో నీరుతాగిన గున్న ఏనుగు... వీడియో వైరల్...

జనరల్‌గా ఏనుగులు తొండంతో నీరు తాగుతాయి. మరి ఆ ఏనుగు పిల్ల అలా ఎందుకు చెయ్యలేదు? ఇదో క్యూట్ వీడియో అంటున్నారు నెటిజన్లు

news18-telugu
Updated: June 21, 2020, 2:04 PM IST
తొండం బదులు నోటితో నీరుతాగిన గున్న ఏనుగు... వీడియో వైరల్...
తొండం బదులు నోటితో నీరుతాగిన గున్న ఏనుగు... వీడియో వైరల్... (credit - twitter)
  • Share this:
మిగతా జంతువుల కంటే భిన్నంగా ఏనుగుకు తొండం ఉంటుంది. దాంతో ఏనుగులు ఎంచక్కా నీరు తాగుతాయి. ఒక్కోసారి తొండం నిండా నీరు నింపుకొని... ఒంటిపై పోసుకొని స్నానం చేస్తాయి. అలాగే.. ఆహారాన్ని తొండంతో చుట్టుకొని... నోట్లో పెట్టుకుంటాయి. ఇలా తొండం వాటికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఐతే... జంతువులకైనా, పక్షులకైనా పిల్లలు పుట్టినప్పుడు అవి చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. అవి చేసే పనులు క్యూట్‌గా ఉంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్ల... అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో ఆ ఏనుగు పిల్ల... గుంపుతో వచ్చి... కొలనులో నీటిని తొండంతో కాకుండా... నోటితో తాగింది.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా... ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నీరు తాగేందుకు గున్న ఏనుగు ఎంతగానో ట్రై చేసినా ఎలా తాగాలో అర్థం కాలేదు. చివరకు... నోటితో తాగిన విధానం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఏనుగులు పుట్టాక 6-8 నెలల్లో తొండంతో నీటిని తాగడం నేర్చుకుంటాయి. ఈ ఏనుగు పిల్ల ఇంకా నేర్చుకోలేదన్నమాట. తొండంతో ఎలా తాగాలో తెలియకపోవడం వల్లే నోటితో తాగిందనుకోవచ్చు. ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. వీడియో చాలా బాగుందనీ... గున్న ఏనుగు ముద్దొస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
First published: June 21, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading