ఈ హెయిర్ కటింగ్ చాలా కాస్ట్‌లీ గురూ...

సాధారణంగా హెయిర్ కటింగ్‌కు అయ్యే ఖర్చెంత? మహా అయితే రూ. 30 లేదా రూ. 50. పట్టణాల్లో, మెట్రో నగరాల్లో ఆ ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చు. కానీ మరీ వేలల్లో వసూలు చేయదగిన హెయిర్ కటింగ్ ఉంటుందా? ఉండకపోవచ్చు కానీ, గుజరాత్‌తోని అహ్మదాబాద్‌కు ఓ వ్యక్తి మాత్రం.. ఒక్కరికి హెయిర్ ట్రిమ్ చేసినందుకు రూ. 28వేలు బహుమతిగా పొందాడు. అదెలాగంటే..

news18-telugu
Updated: February 13, 2019, 5:50 PM IST
ఈ హెయిర్ కటింగ్ చాలా కాస్ట్‌లీ గురూ...
అహ్మదాబాద్‌లో ట్రిమ్మింగ్ చేయించుకున్న హెరాల్డ్
  • Share this:
సాధారణంగా హెయిర్ కటింగ్‌కు అయ్యే ఖర్చెంత? మహా అయితే రూ. 30 లేదా రూ. 50. పట్టణాల్లో, మెట్రో నగరాల్లో ఆ ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చు. కానీ మరీ వేలల్లో వసూలు చేయదగిన హెయిర్ కటింగ్ ఉంటుందా? ఉండకపోవచ్చు కానీ, గుజరాత్‌తోని అహ్మదాబాద్‌కు ఓ వ్యక్తి మాత్రం.. ఒక్కరికి హెయిర్ ట్రిమ్ చేసినందుకు రూ. 28వేలు బహుమతిగా పొందాడు. అదెలాగంటే..

నార్వేకు చెందిన హెరాల్డ్ బాల్డర్ ప్రపంచ దేశాలు పర్యటిస్తూ.. ఆ ట్రావెల్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. అలా, చాలా ఫేమస్సయ్యాడతను. తాజాగా, ఇండియాకు వచ్చిన హెరాల్డ్..  అహ్మదాబాద్‌కు వెళ్లాడు. అక్కడ రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌పై కుర్చీ పెట్టుకుని.. కటింగ్ చేస్తున్న ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. హెయిర్ ట్రిమ్ చేయమని చెప్పాడు. అలా రోడ్డుపక్కనే సెలూన్ నడపడం చూసి ముచ్చటపడిన హెరాల్డ్.. అతను హెయిర్ ట్రిమ్ చేసినంత సేపు వీడియో షూట్ చేశాడు. ఆ సమయంలోనే బార్బర్‌తో మాట కలిపిన హెరాల్డ్.. వ్యాపారం ఎలా సాగుతోంది? రోజుకు ఎంత మంది కస్టమర్లు వస్తారు? అంటూ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడు. కటింగ్ అయిన తర్వాత.. ఆ వ్యక్తితో సరదాగా సెల్ఫీలూ దిగాడు. డబ్బులు ఎంత చెల్లించాలని అడగ్గా.. అతడు కేవలం రూ. 20 ఇవ్వమని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన హెరాల్డ్ .. అతని నిజాయితీకి మెచ్చి రూ. 28000 (400 డాలర్లు)బహుమతిగా ఇచ్చారు. అందులో నిజాయితీ ఏముందీ అంటే.. ఆసక్తికరమైన సమాధానం చెప్పుకొచ్చాడు హెరాల్డ్.‘‘ అతను చేసిన పనికి కొత్త వ్యక్తినైన నా దగ్గర ఎన్ని ఎక్కువ డబ్బులైనా వసూలు చేయవచ్చు. ఇంకా ఎక్కువ చార్జిని డిమాండ్ చేయవచ్చు. కానీ, అతను నిజాయితీగా రూ. 20 అని చెప్పాడు. అంతకన్నా ఎక్కువ అడిగితే కోపం వచ్చేదేమో. నా ప్రయాణంలో కలిసిన మంచి వ్యక్తిగా అతనికి.. బహుమతి ఇవ్వాలనుకున్నా. అందుకే 400 డాలర్లు ఇచ్చా’’ అని చెప్పాడు హెరాల్డ్. ఇక, తానిచ్చిన డబ్బుతో వ్యాపారానికి అవసరమైన ఏదైనా పరికరం కొనుక్కోమని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చాడు. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు హెరాల్డ్. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తె వైరల్ అవుతోంది.

First published: February 13, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading