( K. Haribabu, Rajanna siricilla)
సినిమాలు చూస్తూ సినిమాల్లో ఉండే వివిధ పాత్రల హెయిర్ స్టైల్ (Hair styles)తో ట్రెండ్ చేస్తున్నాడు ఓ యువకుడు (Bank employee model). ప్రతి మూడు నెలలకొకసారి వినూత్నమైన కలర్స్ తో హెయిర్ స్టైల్ మార్చుకుంటూ ఉంటాడు ఈ వేములవాడ కుర్రాడు. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ (Vemulavada) పట్టణానికి చెందిన చిందం దత్తు (Chindam Dattu) అనే యువకుడు మోడల్ గా ఎదిగేందుకు వివిధ రకాల వినూత్నమైన హెయిర్ స్టైల్స్ (variety of innovative hairstyles) తో తనకంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన ట్రెండీ దుస్తులు, హెయిర్ స్టైల్స్ కోసం ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాలకు వెళ్తుంటాడు యువకుడు. ఇప్పటివరకు 20 వరకు హెయిర్ స్టైల్ వివిధ రూపాల్లో మార్చుకున్నాడు.
దత్తు వస్తున్నాడు అంటే భయం..
ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం (Bank employee) చేస్తూనే తను మోడల్ (Model) కావాలని వినూత్న ప్రయత్నాలు చేశాడు. హెయిర్ స్టైల్, ఫ్యాషన్ దుస్తులతో వేములవాడ పట్టణంలో ఆ యువకుడు వస్తున్నాడు అంటేనే చిన్న పిల్లలు భయపడతారంటే అతిశయోక్తి కాదు. స్కూల్ కి వెళ్ళే పిల్లలు స్కూల్ కు వెళ్ళడం అంటే దత్తు వస్తున్నాడు అంటే పిల్లలు భయపడి వెంటనే స్కూలుకి వెళ్తారు.. అలాగే అన్నం తినని పిల్లలు అన్నం తినడం.. ఇష్టం వచ్చినట్లు బయట తిరిగే పిల్లలు కూడా దత్తు చూస్తే బూచోడు వచ్చాడు అంటూ పరుగులు తీస్తారు.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల కుటుంబ సభ్యులు తమ పిల్లలు మారాం చేసినా, అన్నం తినకపోయినా, స్కూల్స్ కు పోకపోయినా దత్తు వస్తున్నాడు అంటే చాలు పిల్లలు.. గప్ చుప్ అయిపోతారని పిల్లల తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల ప్రజలు, దత్తు కూడా చెబుతున్నాడు.
గ్రామీణ ప్రాంతాల్లో కి వెళ్తే తన వేషధారణ చూసి కొందరు భయపడి వృద్ధులు, మహిళలూ, పిల్లలు సైతం ఇండ్లలోకి వెళ్లిపోతారని, మరికొందరు ఏ దేశం నుంచి వచ్చావు అంటూ అడుగుతారని, మంత్రాలు చేసే వాడు వచ్చాడు భయాందోళనలకు గురైన సంఘటనలు ఉన్నాయని దత్తు అంటున్నాడు. ఏదేమైనప్పటికీ తనకు నచ్చిన బట్టలు వేసుకుని నూతన హెయిర్ స్టైల్స్ తో ఉండడం అంటే తనకు చాలా ఇష్టమని గుంపులో ఒకడిగా ఉంగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలంటున్నాడు.
గల్ఫ్ నుంచి ఇండియాకు..
ఇలా వివిధ రకాల హెయిర్ స్టైల్ (Different Hairstyles) చేసుకుంటూ.. మోడల్ కావాలని ఎందుకనిపించిందని ప్రశ్నిస్తే.. గతంలో తాను గల్ఫ్ వెళ్లానని.. అక్కడ ఫిలిప్పీన్స్ (Philippines) చెందిన దేశస్తులు వివిధ రకాల దుస్తులు ధరించి వినూత్నమైన హెయిర్ స్టైల్ తో కనిపించడం తనకు ఇంట్రెస్ట్ పెరిగిందని, అలా తానెందుకు చేసి కనిపించకూడదు అని గల్ఫ్ నుంచి ఇండియాకు వచ్చానన్నారు. వచ్చేటప్పుడే వినూత్నమైన హెయిర్ స్టైల్‌తో ఇండియాలో అడుగు పెట్టాడు. అప్పుడు దత్తుని అందరు విచిత్రంగా చూశారు. వినూత్నమైన ట్రెండ్ సెట్ చేయడానికి తాను ఏలాంటి ప్రయోగాలైనా చేస్తానంటున్నాడు. హైదరాబాద్ (Hyderabad), ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా (Goa), హైదరాబాద్ ప్రాంతాల్లో ఫ్యాషన్ షోస్‌లలో (Fashion shows) పాల్గొన్న దత్తుకు.. ఎన్నో అవార్డ్స్, మెమెంటోలు వరించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Employees, Fashion, Model, Trending news