How? ఎలా?.. అక్కడ అన్నీ ఆడ తిమింగలాలే.. కానీ, అందులో ఒక బుల్లి షార్క్ పుట్టింది ఎలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రకృతిలో కొన్ని జీవుల్లో ఆడ, మగ సంగమం లేకుండానే పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. కానీ, షార్క్‌ల్లో ఎప్పుడూ అలాంటి ఘటనలు జరిగినట్టు సైంటిస్టులు గుర్తించలేదు. ఇప్పుడు సైంటిస్టులకు పనిపడింది. షార్క్‌ల్లో కూడా ఇలాంటి పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగితే ఏమవుతుంది?

  • Share this:
    ఈ సృష్టిలో కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు ‘ఔను. నిజమే ఈ సృష్టి చాలా చిత్రమైంది.’ (Nature Wonders) అని జనం అనుకుంటూ ఉంటారు. అలాంటి చిత్రమైన స్టోరీనే మీరిప్పుడు చదవబోతున్నారు. అయితే, ఆ స్టోరీ చదివే ముందు ఓ మాట. కన్యలు గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చిన (Parthenogenesis or virgin births) సందర్భాల గురించి విన్నాం. ఇప్పటికీ కూడా కొన్ని రకాలు జీవులు ఆడ, మగ జీవుల సంపర్కం లేకుండానే సంతానానికి జన్మనిస్తాయి. కొన్ని రకాల మొక్కలు, కీటకాలు, సరీసృపాలు, పక్షులతో పాటు కొన్ని రకాల చేపల్లో కూడా ఇలాంటి పునరుత్పత్తి ప్రక్రియను ఇప్పటికే సైంటిస్టులు గుర్తించారు. కానీ, షార్క్‌ల్లో మాత్రం ఎప్పుడూ అలాంటిది గుర్తించలేదు. అందుకే ఇది చిత్రమైన స్టోరీగా నిలిచింది.

    ఇటలీలోని సార్డియానా నగరంలో (Sardinia, Italy) షార్క్‌ల ట్యాంక్ ఉంది. అందులో అన్నీ ఆడ తిమింగలాలే ఉన్నాయి. అలాంటిది సడన్‌గా ఒక బుల్లి షార్క్ కనిపించింది. దీంతో అక్కడున్న ఆ ట్యాంక్ సంరక్షకులు ఆశ్చర్యపోయారు. అన్నీ ఆడ షార్క్‌లే ఉంటే ఇదెలా వచ్చిందబ్బా అని డౌట్ పడ్డారు. వేరే ఎవరైనా తీసుకొచ్చి అందులో వేశారా? అనే అనుమానం కూడా కలిగింది. దీంతో ఎందుకైనా మంచిదని ఒకసారి వారు ఆ బుల్లి షార్క్‌ను తీసుకుని దానికి DNA టెస్టులు చేశారు. అలాగే, అందులో ఉన్న తిమింగలాల డీఎన్‌ఏతో చెక్ చేశారు. అప్పుడు వారికి ఓ షాకింగ్ విషయం అర్థమైంది. అందులో ఉన్న ఓ ఆడతిమింగలంతో ఈ బుల్లి షార్క్ డీఎన్‌ఏ దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు. దీనిపై మరింత సమగ్రంగా పరీక్షలు జరిపితే కానీ ఓ క్లారిటీకి రాలేని పరిస్థితి ఏర్పడింది.

    Video: మొబైల్ ఎత్తుకుపోయిన చిలుక!.. చివరకు ఏం జరిగిందంటే..



    ఈ క్రమంలో ఆ తల్లి తిమింగలం ఎక్కడ ఉంది? అది ఏ షార్క్‌తో కలసి ఉంటుందనేది చెక్ చేశారు. అందులో మరో ఆడ తిమింగలంతోనే అది ఉంటుందని గుర్తించారు. ఈ మధ్య కాలంలోనే కాదు. గత పదేళ్లుగా ఆడ తిమింగలం మిగిలిన లేడీ షార్క్‌లతోనే ఉంటోంది. మరి అలాంటిది ఈ బిడ్డ ఎలా పుట్టింది? ఇదే సైంటిస్టులకు అంతుచిక్కకుండా ఉంది. కొన్ని రకాల చేపల్లో ఇలాంటి పునరుత్పత్తి ప్రక్రియ ఉన్నా కూడా షార్క్‌ల్లో ఎప్పుడూ కనిపించలేదు. దీంతో వారు ఇదెలా జరిగిందబ్బా అని బుగ్గలు నొక్కుకుంటున్నారు.

    Cobra bites Chef: చనిపోయిన 20 నిమిషాలకు లేచి మనిషిని చంపిన కోబ్రా.. ఎక్కడంటే



    ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రజీవులు అంతరించిపోయే ప్రమాదం వస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే షార్క్‌లను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు షార్క్‌లు ఈ తరహాలో పునరుత్పత్తి చేస్తే.. అప్పుడు అవి అంతరించిపోతాయేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: