చనిపోయిందని తెలీక తల్లిని నిద్ర లేపుతున్న బిడ్డ.. వేటగాళ్ల దాడిలో..

Trending News: ఓ భారీ రినో వేటగాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలింది. అక్కడే ఉన్న దాని బిడ్డ తల్లి నిద్రపోయిందేమో అని అనుకొని, తట్టి లేపేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. అయినా లాభం లేకపోయింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 4, 2019, 8:19 AM IST
చనిపోయిందని తెలీక తల్లిని నిద్ర లేపుతున్న బిడ్డ.. వేటగాళ్ల దాడిలో..
తల్లి రినోను తట్టి లేపుతున్న బిడ్డ
  • Share this:
తల్లి చనిపోయిందని తెలీదు ఆ బిడ్డకు.. కొందరు వేటగాళ్ల కర్కషత్వానికి నేలకొరిగిందని తెలీదు ఆ మూగ జీవానికి.. తనను లాలించి, పెంచుతున్న ఆ తల్లి కదలకుండా, మెదలకుండా ఉండడాన్ని చూసి.. తట్టి లేపేందుకు శతవిధాలా ప్రయత్నించింది. చుట్టూ తిరుగుతూ లే అమ్మా! అంటూ బతిమిలాడింది. కానీ, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలీదు దానికి. వివరాల్లోకెళితే.. ఓ భారీ రినో వేటగాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలింది. అక్కడే ఉన్న దాని బిడ్డ తల్లి నిద్రపోయిందేమోననుకొని, తట్టి లేపేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. అయినా లాభం లేకపోయింది.

పలువురిని కదిలించే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ ట్వీట్ చేశారు. వేటగాళ్ల వల్ల ఓ మూగ జీవం మృతిచెందిందని, ఆ కారణంగా దాని బిడ్డ ఎంతలా తల్లడిల్లుతుందో చూడండంటూ ఆయన పోస్టు చేశారు.


Published by: Shravan Kumar Bommakanti
First published: July 4, 2019, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading