Viral: భార్య కోసం కొత్తరకం ఇంటిని నిర్మించిన 72 ఏళ్ల వృద్ధుడు.. దాని ప్రత్యేకత ఏంటంటే..

గుండ్రంగా తిరిగే ఇల్లు

ప్రేమించే వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా చేస్తారనేది జీవిత సత్యం. వారి సంతోషం కోసం ప్రత్యేకమైన నిర్మాణాలకు ప్రాణం పోస్తారు కొందరు వ్యక్తులు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజమహల్ ( Tajmahal) కూడా షాజహాన్ తన భార్యపై ప్రేమకు గుర్తుగా నిర్మించిందే.

  • Share this:
ప్రేమించే వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా చేస్తారనేది జీవిత సత్యం. వారి సంతోషం కోసం ప్రత్యేకమైన నిర్మాణాలకు ప్రాణం పోస్తారు కొందరు వ్యక్తులు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ ( Tajmahal) కూడా షాజహాన్ తన భార్యపై ప్రేమకు గుర్తుగా నిర్మించిందే. అయితే అంత గొప్ప నిర్మాణం కాకపోయినా ఉత్తర బోస్నియాకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు.. తన భార్య కోసం ఏకంగా గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించి వార్తల్లో నిలిచాడు. ఈ రొటేటింగ్ హౌజ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇలాంటి టెక్నాలజీపై అతడికి ఏమాత్రం పట్టులేదు. ఆ మాటకొస్తే.. కనీసం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. అయినా ఈ కొత్తరకం ఇంటి నిర్మాణంతో వార్తల్లో నిలుస్తున్నారు వోజిన్ కుసిక్ అనే వ్యక్తి.

తన భార్య జుబికాపై ప్రేమకు గుర్తుగా ఈ ఇంటిని నిర్మించి ఆమెకు కానుకగా ఇచ్చారు కుసిక్. ఆ ఇళ్లు ఎప్పటికీ తాజాగా ఉండటానికి ముందుబాగం ఆకుపచ్చగా, పైకప్పు నిర్మాణంలో ఎర్రటి మెటల్ ఉపయోగించారు. అనేక కిటీకిలు కూడా ఏర్పాటు చేసి మెరిసేలా తీర్చిదిద్దారు. ఈ ఇళ్లు 360 డిగ్రీల్లో చూట్టూ తిరగగలదు. తన భార్య ఏమి చూడాలనుకున్నా ఇంట్లో కూర్చుంటే చాలు.. చుట్టూ ఏం జరిగినా తెలుసుకోగలదని వోజిన్ కుసిక్ చెప్పుకొచ్చారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


ఈ తిరిగే ఇల్లు ఎంతో మందిని ఆకర్షిస్తోంది. దీన్ని తాజ్‌మహల్ తో పోల్చలేం కానీ, ఇది కచ్చితంగా ప్రేమ స్మారకం అనడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ఇంటి ముందు పచ్చని భాగం, ఎర్రని లోహపు కప్పుతో నిర్మించిన ఈ ఇళ్లు గుండ్రంగా తిరగడం అనేది అందరినీ ఆకర్షించే విషయమని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక కొనియాడింది.

ఇది కూడా చదవండి: Amazon Great Indian Festival: కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా.. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ఇంత తక్కువకు వస్తుంటే ఇంకేంటి లేట్..

తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించిన తరువాత ఇలాంటి ఇల్లు తయారు చేయడానికి తగినంత సమయం దొరికిందని తెలిపారు కుసిక్. ఇంటి పరిసరాల్లోకి వచ్చేవారు తనకు కనిపించడం లేదని జుబికా ఆయనకు చెప్పిందట. దీనికి తోడు బెడ్‌రూమ్‌లో ఎండ ఎక్కువగా పడుతోందని చెప్పడంతో గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించినట్టు చెప్పారు. ఇప్పుడు గుండ్రంగా తిరిగే ఇంటితో పాటు ముందు తలుపు కూడా తిరుగుతుంది. దీంతో అటువైపు ఎవరు వచ్చినా చూడటానికి వీలవుతుంది. ఎవరైనా వస్తే వారివైపు ఇంటిని తిప్పవచ్చు కూడా. వారితో మాట్లాడి వెనక్కు పంపించవచ్చని కుసిక్ నవ్వుతూ చెప్పారు.
Published by:Sambasiva Reddy
First published: