• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • A 27 YEAR OLD MAN DECLARED BRAIN DEAD AFTER AN ACCIDENT IN KARNATAKA WAS RESPONDING TO TREATMENT AND HIS VITALS WERE NORMAL SSR

పోస్ట్‌మార్టంకు తీసుకెళ్లడంతో చనిపోయాడని బ్యానర్లు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. కానీ..

పోస్ట్‌మార్టంకు తీసుకెళ్లడంతో చనిపోయాడని బ్యానర్లు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. కానీ..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకలోని బెళగావిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం 27 ఏళ్ల యువకుడిని చావు వరకూ తీసుకెళ్లింది. బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడు బతికే ఉన్నాడని పోస్ట్‌మార్టం వరకూ వెళ్లిన సందర్భంలో తెలియడం కొసమెరుపు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 27న మహాలింగపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శంకర్ గోంబి అనే 27 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతనిని బెళగావిలోని...

  • Share this:
    బెంగళూరు: కర్ణాటకలోని బెళగావిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం 27 ఏళ్ల యువకుడిని చావు వరకూ తీసుకెళ్లింది. బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడు బతికే ఉన్నాడని పోస్ట్‌మార్టం వరకూ వెళ్లిన సందర్భంలో తెలియడం కొసమెరుపు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 27న మహాలింగపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శంకర్ గోంబి అనే 27 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతనిని బెళగావిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగలడంతో వైద్యులు చికిత్సనందించారు. రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచినప్పటికీ ఆ యువకుడిలో ఎలాంటి స్పందన లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు భావించిన వైద్యులు అతనిని తీసుకెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటిలేటర్ తీసేసిన మరుక్షణం శంకర్ చనిపోతాడని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. శంకర్‌ చనిపోయాడనుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మహాలింగపురం ప్రభుత్వాసుపత్రికి అతనిని తరలించారు. సోమవారం శంకర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. శంకర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసే బాధ్యతను విధుల్లో ఉన్న ఎస్‌ఎస్ గలాలి అనే వైద్యుడు తీసుకున్నారు. తాను హాస్పిటల్‌కు వస్తుండగా, రోడ్డు పక్కన గోంబి చనిపోయినట్లుగా అతనికి నివాళి తెలుపుతూ, శ్రద్ధాంజలి ఘటిస్తూ రోడ్డు పక్కన కటౌట్లు, బ్యానర్లు చూశానని గలాలి తెలిపారు.

    పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు వెళ్లి చూడగా.. అది శంకర్ గోబి అని గుర్తించినట్లు చెప్పారు. అయితే.. శంకర్ గోంబి అప్పటికీ వెంటిలేటర్‌పై ఉండటాన్ని గోంబి గమనించారు. చనిపోయిన వ్యక్తికి వెంటిలేటర్ ఎందుకు ఉంచారని గోంబి కుటుంబసభ్యులను గలాలీ అడిగారు. గోంబికి వైద్యం చేసిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు వెంటిలేటర్ తీసేసిన వెంటనే అతను చనిపోతాడని.. చికిత్సకు స్పందించడం లేదని.. అందువల్ల ఉంచినా.. తీసేసినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పినట్లు గోంబి కుటుంబ సభ్యులు తెలిపారు. గోంబి చనిపోయినట్లు సోషల్ మీడియాలో తన స్నేహితులు పోస్ట్ చేయడంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి వద్దకు దాదాపు వెయ్యి మంది వచ్చినట్లు గలాలి తెలిపారు. పోస్ట్‌మార్టం మొదలుపెట్టేందుకు తన చేతితో గోంబిని ముట్టుకోగానే అతని రోమాలు నిక్కబొడుచుకోవడం తాను చూశానని.. దీంతో.. అతను బతికే ఉన్నాడని గ్రహించానని.. అతని శరీరంలో స్పందనలు ఉన్నాయని తెలిసిందని గలాలి తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్‌ను, గోంబి హృదయ స్పందనను పరిశీలించానని ఆయన చెప్పారు.

    నాడి ఇంకా కొట్టుకుంటుడటాన్ని గమనించి వెంటిలేటర్‌ను తొలగించానని.. ఊహించని విధంగా వెంటిలేటర్ తొలగించిన కొద్దిసేపటికి గోంబి చేతులు కదిలించాడని గలాలి చెప్పారు. తాను వెంటనే కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి అతనిని చికిత్స నిమిత్తం పంపినట్లు డాక్టర్ గలాలి తెలిపారు. గోంబి తాజా ఆరోగ్య పరిస్థితిపై గలాలి స్పందిస్తూ.. శంకర్ గోంబి చికిత్సకు స్పందిస్తున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. తన 18 ఏళ్ల కెరీర్‌లో 400కి పైగా పోస్ట్‌మార్టమ్స్ చేశానని.. కానీ ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు