25 ఏళ్ల నాటి బర్గర్‌ని తిన్న మహిళ... బాగుందని కామెంట్... వైరల్ వీడియో...

అప్పుడప్పుడూ విచిత్రాలు జరుగుతూ ఉంటాయి కదా... ఇది అలాంటిదే. ఏంటో, ఏం జరిగిందో సింపుల్‌గా తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 12, 2020, 2:50 PM IST
25 ఏళ్ల నాటి బర్గర్‌ని తిన్న మహిళ... బాగుందని కామెంట్... వైరల్ వీడియో...
25 ఏళ్ల నాటి బర్గర్‌ని తిన్న మహిళ... బాగుందని కామెంట్... (credit - twitter - Michael Patrick)
  • Share this:
విదేశాల్లో అదో ఇల్లు... ఆ ఇంట్లో ఓ షెడ్ ఉంది. అందులో ఓ ఫ్రీజర్ ఉంది. అందులో... 1995లో ఓ మహిళ... మెక్ డొనాల్డ్స్‌కి చెందిన పాస్ట్రీ (బర్గర్ లాంటిది)ని ఉంచింది. ఆ తర్వాత దాన్ని మర్చిపోయింది. 25 ఏళ్లుగా ఆ బర్గర్ అందులోనే మంచులో గడ్డకట్టి ఉండిపోయింది. తాజాగా ఆమె కొడుకు మైకెల్ పాట్రిక్... లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా... షెడ్డును బాగు చేద్దామని లోపలికి వెళ్లాడు. పనిలో పనిగా ఫ్రీజర్ ఓపెన్ చేశాడు. ఏదో గడ్డ కట్టినట్లు ఉండటం చూశాడు. ఫ్రీజర్‌ను కరిగించగా... పాస్ట్రీ బయటపడింది. అది కొద్దిగా చిన్నగా అయ్యిందే తప్ప... దాని షేపు మారలేదు. 24 ఏళ్ల తర్వాత కూడా అది పాడైన స్మెల్ రాలేదు. ఎలాంటి ఫంగస్సూ దానిపై లేదు.


మార్చిలో ఇలాగే... మాట్ నాదిన్ అనే వ్యక్తి 14 నెలల కిందట భూమిలో కప్పెట్టిన మెక్ డొనాల్డ్స్ బర్గర్‌ను తన పుట్టిన రోజు నాడు బయటకు తీసి తిన్నాడు. అది పాడవకుండా బాగానే ఉంది. తాజాగా... మైకెల్ పాట్రిక్... 25 ఏళ్ల నాటి బర్గర్‌ను బయటకు తీయగా... అతని తల్లి దాన్ని తినేసింది. అది చాలా టేస్టీగా ఉంది చెప్పింది. తన తల్లి అప్పట్లో ఉంచిన బర్గర్... ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో ఉపయోగపడిందని పాట్రిక్ చెప్పాడు. ఆ బర్గర్‌పై ఎక్స్‌పైరీ డేట్... మార్చి 1995 అని ఉంది.


25 ఏళ్ల కిందట ఆ పాస్ట్రీతో... పాట్రిక్ తల్లి... యాపిల్ డెసెర్ట్ చేయాలని అనుకుంది. ఇప్పుడు ఆ డెసెర్ట్ చేసి... ఆమే తింది. ఇలాంటి సాహసం తన తల్లికే చెల్లిందని పాట్రిక్ తెలిపాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.
Published by: Krishna Kumar N
First published: May 12, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading