FaceApp: పద్దెనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడ్ని పట్టించిన ఫేస్‌యాప్
FaceApp: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ యాప్.. 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలుడిని కుటుంబం వద్దకు చేర్చింది.

FaceApp (image: FaceApp)
- News18 Telugu
- Last Updated: July 22, 2019, 4:25 PM IST
వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ముందే తెలుసుకోవడం అసాధ్యం. కానీ, ఫేస్‌యాప్ ఆ కొరతను తీర్చింది. అంత కచ్చితత్వంతో కాకపోయినా.. దాదాపుగా అలాగే ఉంటారని చెబుతూ ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు దీని రూపకర్తలు. ప్రస్తుతం నెట్టింట్లో ఒక ఊపు ఊపేస్తోందీ యాప్. వృద్ధాప్యం కావాలన్నా, యవ్వనంలోకి వెళ్లాలన్నా.. ఈ యాప్‌లో ఫోటో ఉంచితే చాలు.. భూత, భవిష్యత్తు వర్తమానాల్లో ఎలా ఉంటామో చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ యాప్.. 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలుడిని కుటుంబం వద్దకు చేర్చింది. వివరాల్లోకెళితే.. చైనాలోని షెన్జెన్ ప్రావిన్సులో యూ వీఫెంగ్ అనే బాలుడు 2001లో తప్పిపోయాడు. అప్పటికి అతడి వయసు మూడేళ్లు. అతడి తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. ఓ భవనాన్ని నిర్మిస్తుండగా ఆ చోటే వీఫెంగ్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కింద కేసు బుక్ చేశారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో కొన్ని రోజుల తర్వాత కేసు మూసేశారు.

అతడి తల్లిదండ్రులు కూడా ఆశ వదులుకున్నారు. ఇక తమ కుమారుడు దొరకడని ఆ బాధతోనే బతుకీడుస్తున్నారు. కానీ, అందివచ్చిన సాంకేతికత అద్భుతమే సృష్టించింది. వీఫెంగ్ చిన్ననాటి ఫోటోను ఫేస్‌యాప్‌లో అప్లోడ్ చేయగానే.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిపింది. ఆ ఫోటో సహాయంతో పోలీసులు దాదాపు 100 మంది యువకులను విచారించగా.. వీఫెంగ్ దొరికాడు.అయితే, వీఫెంగ్ను సంప్రదించగా.. తననెవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు. అతడి రక్త నమూనాలు సేకరించి, అతడి తల్లిదండ్రుల డీఎన్ఏతో పోల్చిచూడగా సరిగ్గా సరిపోయింది. అంతే.. వీఫెంగ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం అతడు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. దీనిపై జన్మనిచ్చిన తండ్రి మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి తమ కుమారుడికి ఇద్దరు తండ్రులు అని, పెంచి పెద్ద చేసిన తండ్రి తనకు సోదరుడితో సమానం అని ఆనందం వ్యక్తం చేశాడు.

కుమారుడు దొరకడంతో భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు

Intel: ఇంటెల్ నుంచి 1,50,000 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ
TCS: టీసీఎస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ కోర్సు
ఒక్క క్లిక్‌తో అమ్మాయిల్ని నగ్నంగా మార్చే యాప్... కలకలం రేపుతున్న టెక్నాలజీ
రోబోలు ఈ ఉద్యోగాలను ఎప్పటికీ చేయలేవు.. అవేంటంటే..
Artificial Intelligence: న్యూడ్ ఫోటో పోస్ట్ చేస్తే ఏఐ కళ్లకు దొరికిపోతారు
Loading...