Home /News /trending /

A 15 YEAR OLD BOY WHO SWAM FOR AN HOUR IN THE KERALA RIVER WITHOUT ARMS AND LEGS SNR

పిల్లాడు కాదు..మనిషి రూపంలో ఉన్న చేప..అచ్చంగా అలాగే చేశాడు

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Wonder Boy: కేరళలో పదిహేనేళ్ల బాలుడు వండర్ క్రియేట్ చేశాడు. అంగవైకల్యంతో పుట్టిన అసీమ్‌ పెరియార్‌ నదిలో గంట పాటు ఈత కొట్టి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

అవయవలోపంతో పుట్టినప్పటికి ఆ ఆలోచనను తన మనసులోకి రానివ్వడం లేదు పదిహేనేళ్ల పిల్లాడు. శరీర అవయవ నిర్మాణంలో ప్రధానమైనవి కాళ్లు, చేతులు. పుట్టుకతోనే చేతులు లేకుండా బలహీనమైన కాళ్లతో పుట్టిన ఆ బాలుడు ఇప్పుడు తన ధైర్యం, మొండి ప్రయత్నంతో అందరిని మెప్పిస్తున్నాడు. కాళ్లు, చేతులతో పుట్టిన పిల్లలు కూడా చేయలేని సాహసం చేసి ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు. కేరళ (Kerala)రాష్ట్రం అలువాకు చెందిన 15ఏళ్ల మహ్మద్ అసీమ్‌(Muhammad Aseem)ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. పుట్టుకతో చేతులు లేకుండా బలహీనమైన కాళ్లతో పుట్టాడు అసీమ్‌. అయితే తన శరీరంలో చచ్చుబడిపోయే విధంగా ఉన్న కాళ్లతోనే నదిలో వెల్లికల పడుకొని గంట సేవు ఈత కొట్టి రికార్డు సృష్టించాడు. అలువా మహాదేవ్‌ ఆలయం (Aluva Mahadeva Temple)సమీపంలోని పెరియార్‌ నది(Periyar River near)లో సుమారు గంటసేపు నీళ్లలో ఈత కొట్టాడు అసీమ్. శరీర అవయవాల్లో చేతులు, కాళ్లు సరిగా లేకుండా ఎలా ఈత కొడతాడో చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే అన్వర్‌ సాదత్‌( MLA Anwar Sadath)కూడా ఈకార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. బాలుడు నదిలో ఈత కొడుతున్న దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూశారు అలువా ఎమ్మెల్యే. ఈనెల 27న గురువారం రోజున ఈ గ్రేట్‌ కిడ్ చేసిన సహసాన్ని చూసి మెచ్చుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా బాలుడ్ని ముద్దాడి అభినందించారు. అసీమ్‌కి అన్నీ విధాలుగా  సహాయం అందిస్తామని ప్రకటించారు.

చేతులు లేకుండా ఈత కొట్టాడు..
మహ్మద్ అసీమ్‌ ఈత కొట్టడంలో శిక్షణ పొందాడు. కేవలం 14రోజుల పాటు కోచ్‌ సాజి వలస్సెరిల్ అనే స్విమ్మింగ్‌ కోచ్ పెరియార్‌ నదిలో ఈత కొట్టడం నేర్పించాడు. నదిలో ఈత కొట్టే సమయంలో మెళకువలు, ఊపిరి పీల్చుకునే విధానాన్ని దక్కరుండి మరీ నేర్పించారు. వెలిమన్న గ్రామం కోజికోడ్ జిల్లాకు చెందిన అసీమ్‌ ఇప్పుడు అందరికి పరిచయమైపోయాడు.

అంగవైకల్యాన్ని అధిగమించిన బాలుడు..
ఆత్మస్థైర్యం మెండుగా ఉంటే అంగవైకల్యం అడ్డురాదని నిరూపించాడు అసీమ్‌. 15ఏళ్ల పిల్లాడిలో ఇంతటి ధైర్యం, తెగువ చూసిన స్థానికులు అతడ్ని అభినందించారు. అసీమ్‌ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. అసీమ్‌ లాంటి పట్టుదల కలిగిన పిల్లలకు సరైన శిక్షణ ఇప్పించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే వారిలో ఉన్న లోపాన్ని మర్చిపోయి ఇలాంటి అద్భుతాలు మరెన్నో సాధిస్తారని స్థానిక ఎమ్మెల్యే , శిక్షణ ఇచ్చిన గురువు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Kerala, Swimming

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు