Video: సూపర్ మార్కెట్‌లోకి 10 అడుగుల కొండచిలువ.. ఆ తర్వాత!

Video: సూపర్ మార్కెట్‌లోకి 10 అడుగుల కొండచిలువ.. ఆ తర్వాత! (image credit - youtube)

Viral Video: ఇదో థ్రిల్లింగ్ వీడియో. అసలు ఆ సూపర్ మార్కెట్‌లోకి అంత పెద్ద కొండచిలువ ఎలా వచ్చింది... మరి దాన్ని చూసిన కస్టమర్లు ఏం చేశారు. చివరకు దాని పరిస్థితి ఏమైంది? తెలుసుకుందాం.

  • Share this:
    Video: ఏ అడవికో వెళ్లినప్పుడు మనకు పాము కనిపిస్తే... ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే... పాములు అక్కడ సహజంగానే ఉంటాయి. కానీ సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు పాము కనిపిస్తుందని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా... పైగా అది చిన్నది కూడా కాదూ... ఏకంగా 10 అడుగుల పొడవుంది. నల్లగా... పెద్దగా ఉంది. లక్కీగా అది కొండ చిలువ కాబట్టి.. వేగంగా పాకలేక... నెమ్మదిగా ఉంది. అది ఆస్ట్రేలియా... సిడ్నీలోని సూపర్ మార్కెట్‌. వాల్వర్త్ సూపర్ మార్కెట్ చైన్లలో అదీ ఒకటి. హెలెనా అల్టీ... తన పిల్లలకు వంట కోసం వాడే స్పైసెస్ డబ్బాల కోసం వెతుకుతుండగా... ఐటెమ్స్ మధ్యలోంచీ ముందుకొచ్చింది ఈ డైమండ్ పైతాన్ (Diamond Python). దీన్ని చూడగానే హెలెనా ఉలిక్కి పడింది.

    వెంటనే మిగతా కస్టమర్లను ఆమె అలర్ట్ చేసింది. హెలెనా ఆ పామును చూసినప్పుడు అది ఆమెకు 8 అంగుళాల దూరంలోనే కనిపించింది. దాంతో ఆమె అదిరిపడింది. కానీ ఆమెకు పాములు కొత్త కాదు. విషపూరితమైన పాముల్ని ఎలా పట్టుకోవాలో ఆమె ఇదివరకు ట్రైనింగ్ తీసుకుంది. పాముని చూసినప్పుడు మొదట షాకైన ఆమె... ఆ తర్వాత వెంటనే కోలుకుంది. తనే స్వయంగా పామును వీడియో తీసింది.

    హెలెనా సిడ్నీ వైల్డ్‌లైఫ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీలో కొన్నేళ్లపాటూ పనిచేసింది. ఆ అనుభవంతో.. స్వయంగా ఓ సంచిలోకి ఆ పాము వెళ్లేలా చేసింది. అదంతా చూసి... సూపర్ మార్కెట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అంత పెద్ద పామును ఆమె బలే బంధించిందే అనుకున్నారు.

    ఇది కూడా చదవండి: రిక్షాలో అమ్మాయికి.. అపరిచితుడి ముద్దు... రగిలిపోతున్న నెటిజన్లు

    దగ్గర్లోని అడవికి వెళ్లి... పామును అక్కడ సురక్షితంగా వదిలేసింది హెలెనా. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

    ఇది కూడా చదవండి: Video: వధూవరులకు కర్చీఫ్ ఛాలెంజ్... ఎవరు గెలిచారో తెలుసా?

    కస్టమర్లు ఏమాత్రం కంగారు పడకుండా చెయ్యడంలో హెలెనా సక్సె్స్ అయ్యింది. ఆ పాము విషపూరితమైనది కాదనీ ఆమె వాళ్లు నమ్మేలా వివరించగలిగింది. అలాగే.. ఆ పాము చాలా నెమ్మదిగా ఉంటుందనీ... ఎవర్నీ ఏమీ చెయ్యదని చెప్పడంతో... కస్టమర్లు కంగారు పడకుండా నెమ్మదించారు. మొత్తానికి అంత పెద్ద పాము తిరిగి సురక్షితంగా అడవికి చేరింది. పాముల్ని పట్టుకునే ట్రైనింగ్ ఆమె ఇదివరకు తీసుకోవడం ఇప్పుడు ఆమెకు కలిసొచ్చింది. అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: