Home /News /trending /

97 CHILDREN FALL SICK AFTER EATING PANI PURI TRAGEDY AT MADHYA PRADESH FAIR PAH

Shocking: కొంప ముంచిన పానీపూరీ.. 97 మందికి తీవ్ర అస్వస్థత.. ఎక్కడంటే..

పానీపూరీ

పానీపూరీ

Madhya pradesh: వారంతా తమ గ్రామంలోకి వచ్చిన జాతరను చూడటానికి వెళ్లారు. అక్కడ ఆడే వస్తువులు కొనుక్కున్నారు. కొందరు అక్కడ ఉన్న పానీపూరీ స్టాల్ లో గప్ చుప్ లను ఇష్టంగా తిన్నారు.

సాధారణంగా మనలో చాలా మంది ఎగ్జిబిషన్ కు వెళ్తుంటారు. ఎగ్జిబిషన్ లో రకరకాల జాయింట్ వీల్స్, ఆట వస్తువుతు, తినే పదార్థాల స్టాళ్లు ఉంటాయి. చిన్న వారి నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ ను ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక.. ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ నోరూరించే స్పెషల్ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అయితే, కొన్ని సార్లు.. బయటి పదార్థాలు తిన్నప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొందరు తినే పదార్థాలు తయారు చేయడంలో క్వాలిటీని పాటించరు. దీంతో అవి తిన్న వారు వాంతులు, కడుపునొప్పి, అస్వస్థతలకు గురౌతుంటారు. ఇలాంటి సంఘటన ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరిగింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) మండలా జిల్లాలో కొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సింగపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఆ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. అక్కడ జాతర ఏర్పాటు చేశారు. రకారకాల తినే పదార్థాలు, వెరైటీ వస్తువులను అక్కడకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం రోజు కూడా చుట్టు పక్కల గ్రామంనుంచి వందలాది మంది జాతరకు వచ్చారు. వారిలో కొందరు అక్కడ ఉన్న స్టాల్ లోని గప్ చుప్ లను (Pani Puri Tragedy) ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రాత్రి.. చాలా మంది కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందులకు (Fall Sick) గురయ్యారు.

దాదాపు.. 90 కన్న ఎక్కువ మంది ఇలాగే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారిని ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ఇదిలా ఉండగా  కోతి, యువతి పట్ల ఫన్నీ గా ప్రవర్తించింది. ఈ ఘటన వైరల్ గా మారింది.

ఒక యువతి కోతుల దగ్గరకు వెళ్లింది. అక్కడ కింద కూర్చుని సరదగా వాటితో సెల్ఫీ వీడియో రికార్డు చేస్తుంది. ఆమె వెనుకాల కొన్ని కోతులు ఉన్నాయి. అయితే, ఆమె కూర్చుని ఏదో తినడానికి పెడుతుందేమో అని కోతులు అనుకున్నాయి. ఇంతలో ఒక కోతి ఆమె దగ్గరకు వచ్చింది. ఫోన్ లో కోతి (monkeys) తన ప్రతి బింబాన్ని వింతగా చూసింది. ఆమె ఒడిలో ఏదైన ఉందేమో అని చూసి... అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. మరోకోతి వచ్చింది. పాపం.. అది రోమాంటిక్ కోతి కాబోలు.. వస్తునే యువతికి షాక్ కు గురిచేసింది. మెల్లగా యువతి దగ్గరకు వెళ్లింది.

ఆమె కింద కూర్చుని ఉంది. వెంటనే ఆమె డ్రెస్ ను పైకెత్తి చూసింది. దాని కింద ఏమైన దాచిందేమో అని చూసింది. యువతి వెంటనే తన డ్రెస్ ను సర్దుకుంది. కోతి నేనేం చేశా.. అన్నట్లు అమాయకంగా ఆమె వంక చూసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో (Funny video)  నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కోతి భలే రోమాంటిక్, అమ్మాయికి భలే షాక్ ఇచ్చిందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Food, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు