బిచ్చమెత్తుకుంటున్న IIT Engineer.. అతని ఇంగ్లిష్ వింటే షాక్ అవ్వాల్సిందే

బిచ్చమెత్తుకుంటున్న వృద్ధుడితో మాట్లాడుతున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి

జీవిత చరమాంకంలో ఆదరించేవారు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే రోడ్డు పాలు కావాల్సిందే. ఇటువంటి ఘటనలు రోజూ మనం టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉంటాం. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం బిచ్చగాళ్లుగా మారిన సంఘటనలు చూసి ఆశ్చర్యపోతుంటాం. అటువంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ఇటీవల చోటు చేసుకుంది.

  • Share this:
జీవిత చరమాంకంలో ఆదరించేవారు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే రోడ్డు పాలు కావాల్సిందే. ఇటువంటి ఘటనలు రోజూ మనం టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉంటాం. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం బిచ్చగాళ్లుగా మారిన సంఘటనలు చూసి ఆశ్చర్యపోతుంటాం. అటువంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో ఇటీవల చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గ్వాలియర్లోని ఒక బస్టాండ్ వద్ద 90 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు బిక్షాటన(Begging) చేస్తున్నాడు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఆయన స్వర్గ్ సదన్(Swarg Sadan ) ఎన్జీవో వాలంటీర్ల కంట పడ్డాడు. దీంతో వారు ఆ వృద్ధుడిని పలుకరించగా అతడు అనర్గలంగా ఇంగ్లిష్లో సమాదానం ఇస్తుండటంతో సర్గ్ సదన్ వాలంటీర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ వృద్ధుడిని తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకిలా మారారు? అనే విషయాలను ఆరా తీయగా.. తన పేరు సురేంద్ర వశిష్త్ అని, తాను 1969 బ్యాచ్ కు చెందిన ఐఐటీ కాన్పూర్(IIT-Kanpur) మెకానికల్ ఇంజినీరింగ్(Mechanical Engineering) స్టూడెంట్ అని చెప్పాడు. అంతేకాక, నేను 1972వ సంవత్సరంలో లక్నోలో ఎల్ఎల్ఎమ్( LLM) పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు.

అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తికి ఇలాంటి దయనీయ పరిస్థితి రావడంపై సదన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అస్రం స్వార్గ్ ఎన్జీఓ(NGO)కు చెందిన వికాష్ గోస్వానీ(Vikash Goswani) మాట్లాడుతూ, "మేము ఆ వృద్ధుడిని గ్వాలియర్ వీధుల్లోని ఒక బస్ స్టాండ్ వద్ద అత్యంత దయనీయ స్థితిలో కనుగొన్నాం. మేము అతడిని పలుకరించినప్పుడు, ఇంగ్లీషులో అతడు సమాధానం ఇవ్వడాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత అతడిని మా ఆశ్రమానికి తీసుకువచ్చాం. అతడిని తన కుటుంబసభ్యులకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నాం." అని తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితం ఇదే ఆశ్రమ్ స్వర్గ్ సదన్ ఎన్జీఓ సభ్యులు మానసిక సమతుల్యతను కోల్పోయి వీధుల్లో తిరుగుతున్న మనీశ్ మిశ్రా(Manish Mishra) అనే ఒక మాజీ పోలీసు అధికారిని కూడా రక్షించారు.1999 బ్యాచ్ కు చెందిన మిశ్రా మధ్యప్రదేశ్ పోలీసులలో షార్ప్‌షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత విధుల నుండి బహిష్కరణకు గురైన ఆయన 2006 నుండి ఏమయ్యారో ఎవరికీ తెలియకుండా పోయింది. సుమారు 14 ఏళ్ల తర్వాత మిశ్రాను దయనీయ స్థితిలో కనుగొన్న అతని బ్యాచ్ మేట్స్, ప్రస్తుత క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీలు రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ సింగ్ భడోరియా రక్షించారు.
Published by:Nikhil Kumar S
First published: