ఆపరా.. ఆపరా…అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా! నా కళ్లలోకి చూసి సూటిగా మాట్లాడ్డానికి భయపడే నువ్వు.. నా తీర్పుకే ఎదురు చెప్తావా.. ప్రాణాలు తీస్తా..
భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబసభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా ..! ..
ఈ డైలాగ్లు ఎక్కడో విన్నట్టుంది కదూ.. అదేనండి మన పెదరాయుడు సినిమాలోనివి.. మరి ఇప్పుడెందుకు చెబుతున్నావ్.. అంటారా..? తమిళనాడులోని ఓ బుడ్డోడికి ఇపుడు ఈ డైలాగ్లు చాలా అవసరం. ఏం సినిమా యాక్టర్ అవుతున్నాడు అనుకునేరు.. అబ్బే లేదండి.. ఆ బుడ్డోడు 9 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యాడు. వాట్.. ద? అని షాక్ అవకండి... అంటే సీఎం అయ్యింది రాష్ట్రానికి కాదు. తమిళనాడులోని తిరువన్నమల్లై జిల్లాలో ఉండే కొండ ప్రాంతానికి. ఓ అంతేనా అనుకుంటున్నారా? కానీ, కొండ ప్రాంతంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 427 గ్రామాలు.. అక్కడ ఈ బుడ్డోడు మాంచి పెదరాయుడు బట్టలు వేసుకొని, టోపీ పెట్టుకుని, ఠీవీగా కుర్చీలో కూర్చుని జనం సమస్యలు వింటున్నాడు.. తీర్పులు చెబుతున్నాడు.. ఇప్పుడు అక్కడి ప్రజలకు ఆ పిల్లాడు చెప్పిందే తీర్పు.. అదే వేదం.. ఇంతకీ ఎవరా కుర్రాడు.. ఎక్కడుంటాడు.. అసలు 9 ఏళ్ల పిల్లాడికి అన్ని బాధ్యతలు ఎవరు అప్పగించారు. ఎందుకు అప్పగించారు? అనుకుంటున్నారా.. అయితే ఓ సారి తెలుసుకుందాం..
అక్కడ పోలీసు, న్యాయవ్యవస్థే లేదు..
తమిళనాడులోని తూర్పు కనుమలకు ఆనుకుని ఉన్తిన రువళ్ల మనై, వెళ్లూరు, తిరపట్టూర్ ప్రాంతాల పరిధిలో ఓ 427 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏం ఉండవు. అక్కడి ఓ కుటుంబపెద్ద వారికి పెదరాయుడు. అయితే గత 80 ఏళ్లుగా ఆ గ్రామానికి పెద్దగా వ్యవహరించిన మల్లిమాడుకు చెందిన చిన్నంది(87) గతేడాదే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో 427 గ్రామాలకు పెద్దని ఎన్నుకోవడానికి మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ఓ 36 గ్రామాల పెద్దలు చిన్నంది మనవడినే పీఠం అధిష్టించాలని సూచించారు. ఈ పిల్లోడి పేరు శక్తివేల్. ఐదో తరగతి చదువుతున్నాడు. గ్రామాల ప్రజలంతా ఏక గ్రీవంగా శక్తివేల్ ను తమ సీఎంగా ఎన్నుకున్నారు. పంచాయితీలు ఎలా చేయాలనే దానిపై కొన్నిరోజులు బుడ్డోడికి ట్రెయినింగ్ కూడా ఉంటుందట. తన ప్రజలకు న్యాయం చేస్తానని.... తాత వారసత్వాన్ని నిలబెడుతానన్నాడు కుర్రాడు. ఇక ఇపుడు జావదు కొండ ప్రాంతంలోని 427 గ్రామాలకు ఇతనే రూలర్ (Ruler). ఈ 427 గ్రామాల్లో బుడ్డోడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. ఊళ్లల్లో ఏ చిన్నా పని జరగాలన్న బుడ్డోడి పర్మిషన్ కంపల్సరీ. ఇంట్లో గొడవలు మొదలు భూముల పంచాయితీ వరకు బుడ్డోడే చూస్తాడు. ఉళ్లల్లో పరిపాలన సజావుగా జరగడానికి ప్రతి ఊళ్లో కొందరు వ్యక్తులతో ఓ వ్యవస్థ ఉంటుంది. వాళ్లందిరీ హెడ్ ఈ బుడ్డోడే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ruler, School boy, Tamil nadu