బంగారం గని కోసమని వెళ్తితే వాళ్ల బతుకులు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుస్తాయి. ఆఫ్రికా(African country) దేశంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(Congo)గా పిలవబడే ప్రాంతంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. విచిత్రం ఏమిటంటే బంగారు గని(Gold mine)లో గోల్డ్ తొవ్వుకుందామని వెళ్లిన వారికి సజీవంగా కొందరు వ్యక్తులు బయటకు రావడం చూసి షాక్ అయ్యారు. కేజీఎఫ్ సినిమాలో చూసినట్లుగా కాంగోలో వర్షం కారణంగా ఓ గోల్డ్ మైనింగ్ కూలిపోయింది. అదే సమయంలో కొందరు గని లోపల చిక్కుకున్నారు. వర్షం తగ్గిన తర్వాత మరికొందరు కార్మికులు బంగారు గనిని తొవ్వుకునే ప్రయత్నం చేశారు. మట్టితో కప్పేసుకుపోయిన బంగారు గనిని చేతులతో తొవ్వుతుండగా మట్టిలోంచి సుమారు 9మంది సజీవంగా బయటపడ్డారు. అందరూ ప్రాణాలతో మట్టిలోంచి బయటకు రావడం చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఈవీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వర్షంతో తిప్పలు..
అఫ్రిన్‌కన్ దేశం కాంగోలోని ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాంగోలోని బంగారు గనిలో నగల కోసం వెదకసాగారు కొందరు. చేతులతో మట్టిని తొలగిస్తూ లోపల ఏమున్నదో కనుగొనే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గని లోపల చిక్కుకున్న 9మంది ఒకరి తర్వాత మరొకరు మట్టిలోంచి బయటకు వచ్చారు.
వైరల్ అవుతున్న వీడియో..
వర్షం కారణంగా గని కూలిపోవడంతో ప్రజలు లోపలే ఉండిపోయారు. వర్షం తగ్గగానే బంగారు గని కోసం ఓ వ్యక్తి తన చేతులతో గనిని తవ్వడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 9 మందిని సజీవంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
బంగారం కోసం వెదుకులాట..
ఈవార్తను వీడియో ద్వారా మాత్రమే గుర్తించగలిగాం. వర్షం కారణంగా బంగారు గనిలో చిక్కుకున్న వాళ్ల వివరాలు ఏంటో.? ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై మాత్రం పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఇంకా అక్కడ బంగారం కోసం గనిలో తవ్వకాలు జరుపుతున్న వాళ్లు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Africa, VIRAL NEWS, Viral vide