ఆమె నిండు గర్భిణీ. కడుపులో నవ మాసాల బిడ్డ ఉంది. ఇక రేపో మాపో ఆ పాప ఈ ప్రపంచం మీదకు రాబోతుంది. మాములుగానైతే తల్లులకు అది చాలా కీలక సమయం. ఏమాత్రం తేడా వచ్చినా.. జరగరానిది ఏమైనా జరిగినా కడుపులో బిడ్డతో పాటు తల్లికీ ప్రమాదమే. అందుకే ఆ టైంలో తల్లులు చాలా కేర్ తీసుకుంటారు. చాలా వరకు మంచం మీద నుంచి కాలు కదపరు. వారికి కావాల్సినవన్నీ మంచం మీదకే తెప్పించుకుంటారు. కానీ ఈమె మాత్రం.. నిండు గర్భిణీగా ఉండి డాన్స్ చేసింది. డాన్స్ అంటే ఏదో కాళ్లు, చేతులు ఆడించడం కాదు.. బెల్లీ డాన్స్. శరీరంలోని పార్ట్స్ మొత్తం కదిలించే డాన్స్ అది.
యూట్యూబ్ లో ఒక వీడియో వైరలవుతున్నది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చే మూడు రోజుల ముందు బెల్లీ డాన్స్ చేసింది. బెల్లీ డాన్స్ అంటేనే బాడీని మొత్తం వారి ఆధీనంలోకి తీసుకోవడం. శరీరాన్ని మొత్తం విల్లులా వంచి.. బాడీలోని ప్రతి పార్ట్ ను కదిలించాల్సి ఉంటుంది.
ఇలాంటి డాన్స్ ను సాధారణ సమయంలో చేయడమే కష్టమనుకుంటే.. ఈ మహిళ మాత్రం తాను పాపకు జన్మనివ్వడానికి మూడు రోజుల ముందే చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఈ వీడయో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా.. గర్భవతులుగా ఉన్నవారు ఏ పనులు చేయకూడదని.. వారిని మంచం మీద నుంచి దిగనీయకుండా చేస్తే అది వారికే ప్రమాదమట. చిన్న చిన్న ఎక్సర్సైజ్ లు చేస్తేనే తల్లికి, పుట్టబోయే బిడ్డకు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక అథ్లెట్.. తాను 9 నెలల గర్భిణీ అయి కూడా రికార్డు సమయంలో పరుగు పందాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pregnant, Trending, Trending videos, Viral, Viral Video, Youtube