8YEAR OLD GIRL CAMPAIGNING ON BEHALF OF AYODHYA SAMAJWADI PARTY CANDIDATE IN UTTAR PRADESH VIDEO GOES VIRAL SNR
మా నాన్నకే మీ ఓటు..యూపీ ఎన్నికల ప్రచారంలో 8ఏళ్ల బాలిక ప్రచారం
Photo Credit:Youtube
Video viral: యూపీ ఎన్నికల్లో గమ్మత్తైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రిని గెలిపించమంటూ 8ఏళ్ల బాలిక అయోధ్య నియోజకవర్గ ఓటర్లను కోరుతోంది. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ అంకుల్, ఆంటీ మా నాన్నకే మీ ఓటు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది.
ఎన్నికల వేళ ఎన్ని చిత్రాలు, మరెన్నో విచిత్రాలు ఓటర్లు చూడాల్సి వస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓట్ల కోసం పోటీ చేస్తున్న నాయకులు, వాళ్లు చేసే పనులు, ఇచ్చే వాగ్దానాలు మాటల్లో చెప్పలేం. కానీ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓ అరుదైన ఘటన ఇప్పుడు అందర్ని ఆలోచింపజేస్తోంది, ఆకట్టుకుంటోంది. తన తండ్రి కోసం ఎనిమిదేళ్ల బాలిక ఎన్నికల ప్రచారకురాలి(Election campaign)గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ అయోధ్య(Ayodhya)కు చెందిన పవన్‌పాండే (Pawan pandey) సమాజ్‌వాది పార్టీ (Samajwadi Party)తరపున పోటీ చేస్తున్నాడు. తన తండ్రిని గెలిపించాలని కోరుతోంది అతని ఎనిమిది సంవత్సరాల( 8 years girl)వయసున్న కూతురు గౌరీ పాండే(Gouri pandey). హాయిగా స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులో తండ్రి తరపున ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుంది. వణికే చలిలో ఉదయాన్నే నిద్రలేచి కరపత్రాలను పట్టుకొని ఇంటింటింకి వెళ్తోంది. తలుపులు తట్టి మరీ అంకుల్, ఆంటీ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి కరపత్రాలు ఇచ్చి ఈసారి మా నాన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని దయచేసి మీ ఓటు మా నాన్నకు వేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఎన్నికల బరిలో పవన్ పాండే పోటీ చేస్తోంది ఇదే మొదటి సారి కాదు. 2012లో అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆతర్వాత 2017ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈసారి తన తండ్రి ఓడిపోకూడదన్న ఆలోచనతోనే గౌరీపాండే ఈతరహా ప్రచారం చేస్తున్నానని చెబుతోంది.
మా నాన్నను గెలిపించండి..
గత ఎన్నికల్లో తన తండ్రి ఓడిపోయారని భావించే గౌరీపాండే తండ్రిని మరోసారి అలా జరగకుండా ఉండాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తన తండ్రి విజయం సాధించాలని, ఎలా గెలిపిస్తే అయోధ్య ఓటర్లకు ఇచ్చిన వాగ్ధానాలు అన్నీ నెరవేరుస్తారని ప్రజలకు చెబుతోంది గౌరీపాండే. బాలకార్మికుల్ని పనిలో పెట్టుకోవద్దని చెబుతున్న ప్రభుత్వం..పిల్లలతో ఇలా ఎన్నికల ప్రచారం చేయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోరా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గౌరీపాండే తల్లిదండ్రులు మాత్రం స్కూల్స్ లేకపోవడంతో తానే స్వచ్ఛందంగా ఇలా చేస్తానని కోరిందని అందుకే అంగీకరించామని చెబుతున్నారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో విసిత్రాలు ..
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. మరోవైపు యోగీ సర్కారుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ఇలా ప్రజాప్రతినిధుల పిల్లలు, వారి కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావడం కొత్తగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి ప్రచారం కారణంగా సింపతీ పెరిగి ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.