35 ఏళ్ల లవర్‌ను పెళ్లి చేసుకున్న 81 ఏళ్ల బామ్మ.. ఫస్ట్ నైట్ అనుభవాలను టీవీ షోలో వెల్లడించింది

శృంగారానికి వయసుతో పనిలేదంటుంది 81 ఏళ్ల బామ్మ. లేటు వయసులో సెక్స్ కోరికలను చంపుకోలేని ఆమె 35 ఏళ్ల తన లవర్‌ను పెళ్లాడింది.

news18-telugu
Updated: November 10, 2020, 5:39 PM IST
35 ఏళ్ల లవర్‌ను పెళ్లి చేసుకున్న 81 ఏళ్ల బామ్మ.. ఫస్ట్ నైట్ అనుభవాలను టీవీ షోలో వెల్లడించింది
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారానికి వయసుతో పనిలేదంటుంది 81 ఏళ్ల బామ్మ. లేటు వయసులో సెక్స్ కోరికలను చంపుకోలేని ఆమె 35 ఏళ్ల తన లవర్‌ను పెళ్లాడింది. వివరాలు.. ఇంగ్లాడ్‌కు చెందిన 81 ఏళ్ల ఐరిస్ జోన్స్, ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ ఇబ్రహీంలకు గతేడాది ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత బంధం బలపడటంతో.. ఈ జంట పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న ఐరిస్ తన అరుదైన ప్రేమకథను, ఫస్ట్ నైట్ అనుభవాన్ని వెల్లడించడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఫేస్‌బుక్‌లో ఇబ్రహీంతో పీకల్లోతు మునిగి తేలిన ఐరిస్ కైరోకు వెళ్లింది. ఇబ్రహీంను కలిసిన కొద్ది గంటల్లోనే వారి మధ్య మంచి రిలేషన్ కుదిరింది.. కొంతకాలం పాటు ఆమె అక్కడే ఉండిపోయారు. దీంతో ఇబ్రహీం ఆమెను తరుచూ కలిసేవాడు.

ఈ క్రమంలోనే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. బ్రిటీష్ రాయబార కార్యాలయంలో ఇందుకు ఏర్పాట్లుకూడా జరిగాయి. పెళ్లి చేసుకునేందుకు ఇబ్రహీం అతని మొదటి భార్యతో విడాకులు తీసుకున్న కాగితాలు, ఇతర బాధ్యతలు లేవనే పత్రాలు సమర్పించాడు. దీంతో వారి వివాహం జరిగింది. అయితే ఇబ్రహీం ఆమెను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడన్న ఆరోపణలను ఐరిస్ ఖండించారు. "ఇబ్రహీం నన్ను ఎప్పుడూ డబ్బులు అడగలేదు. నా దగ్గర పెద్దగా డబ్బు కూడా లేదు. పిల్లలకు చేయాల్సిన ప్రతీది చేశాను. ఇప్పుడు నా ఆనందాన్ని నేను వెత్తుకున్నాను. బాగా డబ్బు సంపాదించడంలో ఆనందం లేదు" అని ఐరిస్ పేర్కొంది.

81 Years old woman marries her 35 year old lover, Old woman share first night deatials In TV show, Old woman marrie younger man, Iris Jones, Ahmed Ibriham, 35 ఏళ్ల లవర్‌ను పెళ్లి చేసుకున్న 81 ఏళ్ల బామ్మ, ఫస్ట్ నైట్, సెక్స్ లైఫ్, ఐరిస్ జోన్స్, అహ్మద్ ఇబ్రహీం
ఐరిస్ జోన్స్, ఇబ్రహీం


ఇక ఫస్ట్ నైట్ రోజున సెక్స్ సులభతరం చేసేందుకు ఇబ్రహీం కేవై జెల్లీ పూర్తి ట్యూబును వినియోగించామని ఐరిస్ తెలిపింది."నేను 35 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను. అందుకే సెక్స్ చేసే సమయంలో నేను కన్యలా భావించాను. మేము కేవై జెల్లీ యొక్క మొత్తం గొట్టాన్ని ఉపయోగించాము. మరుసటి రోజు నేను కూడా నడవలేకపోయాను. నేను గుర్రపు స్వారీ చేస్తున్నట్లు నాకు అనిపించింది" ఐరిస్ తన ఫస్ట్ నైట్ అనుభవం గురించి చెప్పింది.ఇది విన్న టెలివిజన్ ప్రేక్షకులతో పాటు, షో హోస్ట్ సైతం షాక్‌కు గురయ్యారు. మరోవైపు తనకంటే 40 ఏళ్ల పెద్ద వయసు మహిలను పెళ్లి చేసుకోవడంపై ఇబ్రహీం మాట్లాడుతూ.. తాను డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదని.. ఆమెతో బంధంతో సంతృప్తిగా చెందానని చెప్పాడు.

ఇక, లేటు వయసులో ఐరిస్ పెళ్లిపై ఆమె కుమారుడు స్టీపెన్ జోన్స్(53) స్పందించాడు. ఐరిస్, ఇబ్రహీంల రిలేషన్ బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత తమ కుటుంబం విడిపోయిందని చెప్పాడు. ఇబ్రహీంను ఎప్పటికీ స్టెప్ డాడ్‌గా అంగీకరించనని తెలిపాడు.
Published by: Sumanth Kanukula
First published: November 10, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading