హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: రన్నింగ్ రేసులో పాల్గొన్న 80ఏళ్ల బామ్మ .. రికార్డ్ బ్రేక్ చేసిన వృద్ధురాలి వీడియో ఇదే

OMG: రన్నింగ్ రేసులో పాల్గొన్న 80ఏళ్ల బామ్మ .. రికార్డ్ బ్రేక్ చేసిన వృద్ధురాలి వీడియో ఇదే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Old is Gold: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 80ఏళ్ల వృద్ధురాలు నాలో ఇంకా పరుగులు పెట్టే సత్తా ఉందని అంటోంది. అనడమే కాదు .. పరుగు పందెంలో పాల్గొని నిరూపించుకుంది. 100మీటర్ల రేసును ఎన్ని సెకన్లలో పూర్తి చేసిందో చూడండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Meerut, India

పాతికేళ్ల వయసులో ఉన్నవారికే ఓపిక ఉండటం లేదు. చురుకుగా కదలడం, ఆరోగ్యంగా పరుగులు తీయడం, ఉత్సాహంగా అందరితో కలిసి మాట్లాడటం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది. కాని ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ 80సంవత్సరాల వృద్ధురాలిని చూస్తే ఎవ్వరైనా ఔరా అని ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకోవాల్సిందే. పండు ముసలి వయసులో కూడా లేడి పిల్లలా పరుగు పందాల్లో పాల్గొని తన స్టామినా, ఫిజికల్ ఫిట్‌నెస్‌ ఏంటో నిరూపించుకుంది. మీరట్‌లో జరిగిన ఓ రన్నింగ్ రేస్ వీడియో(Running Race Video)ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా వైరల్(Viral) అవుతోంది.

Shraddawakar: శ్రద్దావాకర్‌ని చంపిన వ్యక్తిపై దాడికి యత్నం .. పోలీసుల ముందే తల్వార్లు, కత్తులతో ఎటాక్.. వీడియో ఇదిగో

పరుగు పందెంలో వృద్ధురాలు..

ఎవరికైనా వయసు పెరుగుతుంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘ కాలిక వ్యాధులు, చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి. ముఖ్యంగా 60సంవత్సరాలు దాటితే కాళ్ల నొప్పులతో నడవటం కష్టంగా ఉంటుంది. కాని ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మీరట్‌(Meerut)కు చెందిన 80ఏళ్ల వృద్ధురాలు(80Year old woman) నాలో ఇంకా పరుగులు పెట్టే సత్తా ఉందని అంటోంది. అనడమే కాదు .. పరుగు పందెంలో పాల్గొని నిరూపించుకుంది. మీరట్‌లో 100మీటర్ల పరుగు పందాలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమ్మాయి, స్టూడెంట్స్‌తో పాటు 80సంవత్సరాల వృద్ధురాలు చీర కట్టుకొని రన్నింగ్ ట్రాక్‌ షూ వేసుకొని పోటీలోకి దిగింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అక్కడున్న వాళ్లంతా వృద్ధురాలు పరిగెత్తుతుందా లేక పడిపోతుందా అని ఆశ్చర్యపోయారు. కాని రన్నింగ్ రేస్( Running Race)నిర్వాహాకులు విజిల్ వేయగానే ట్రాక్‌లోనే రేసుగుర్రంలా పరుగులు పెట్టింది వృద్ధురాలు. 100మీటర్ల(100 Meters) రేసును కేవలం 49సెకన్ల(49 Seconds)లో పూర్తి చేసి అందర్ని ఆశ్చర్యపరిచింది.

100మీటర్ల రేస్‌ని 49సెకన్లలో పూర్తి..

జీవితంలో చివరి అంకంలో ఉన్న వృద్ధురాలు ఎంతో చలాకీగా పరుగు పందెంలో పాల్గొనడమే కాకుండా 100 మీటర్ల రేసును దిగ్విజయంగా పూర్తి చేయడంతో అక్కడున్న వాళ్లతో పాటు నిర్వాహకులు చప్పట్లు కొట్టి మరీ అభినందించారు. పరుగులు పందెంలో పాల్గొన్న చిన్నారులు సైతం ఆమెలోని ఉత్సాహాన్ని చూసి నివ్వెరపోయారు.

బామ్మ హెల్త్ సీక్రెట్ ఏంటో..?

80ఏళ్ల వృద్ధురాలు రన్నింగ్‌ రేసులో పరుగులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్‌లో వైరల్ అవుతోంది. వృద్ధురాలి టాలెంట్‌ని అందరికి తెలిసే విధంగా ఈ వీడియోకి చక్‌ దే ఇండియా సాంగ్‌ని బ్యాగ్రౌండ్‌లో ప్లే చేసి పోస్ట్ చేశారు. చీర కట్టుకొని రన్నింగ్‌ రేసులో పాల్గొన్న వృద్ధురాలి ఆరోగ్య రహస్యం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు ఆవిధంగా పరిగెత్తడమే ఆమె హెల్త్ సీక్రెట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

First published:

Tags: National News, Uttar pradesh, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు