రోడ్డుపక్కన కాలువలో 8 అడుగుల మొసలి...చూస్తే గుండె గుభేల్...

రత్నగరి జిల్లాలోని చిప్లున్ టూరిస్టు ప్రదేశంలో రోడ్డు పక్కన కాలువలో ఏకంగా 8 అడుగుల మొసలి లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: July 31, 2019, 12:32 PM IST
రోడ్డుపక్కన కాలువలో 8 అడుగుల మొసలి...చూస్తే గుండె గుభేల్...
చిక్కిన మొసలి (Image : video grab)
  • Share this:
మహారాష్ట్రలోని రత్నగరి జిల్లాలోని చిప్లున్ టూరిస్టు ప్రదేశంలో రోడ్డు పక్కన కాలువలో ఏకంగా 8 అడుగుల మొసలి లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వాస్తవానికి ఈ ఘటన రత్నగిరి జిల్లాలో చిప్లున్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కింది. రత్నగిరి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఉన్న వాశిష్టి నదిలో వరదలు ముంచెత్తగా, ఆ వరదల్లో సమీప అటవీ ప్రాంతం నుంచి మొసలి దారి తప్పి చిప్లున్ పట్టణంలోకి ప్రవేశించింది. వరదలు తగ్గుముఖం పట్టగా, రోడ్డు పక్కన కాలువలో ప్రత్యక్షమైంది. అటుగా వెళ్తున్న జనం మొసలిని చూసి లబోదిబో మంటూ పరుగులెత్తగా, స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు వచ్చి మొసలిని బంధించడంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. రత్నగిరి ప్రాంతంలో ప్రముఖ టూరిస్టు స్పాటుగా ఖ్యాతి కెక్కింది. ఈ ప్రాంతంలో సావత్సాడ వాటర్ ఫాల్స్, పరశురామ దేవాలయం వల్ల పెద్ద ఎత్తున సంవత్సరం పొడువునా పర్యాటకులు వస్తుంటారు.First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు