Home /News /trending /

78 YEAR OLD MAN MARRIED TO 17 YEAR OLD GIRL GETS DIVORCED IN 22 DAYS AFTER MARRIAGE MS

Viral: ఆమెకు 17..! ఆయనకు 78..!! నెలరోజులు తిరక్కముందే విడాకులు...?

image credits Facebook

image credits Facebook

బాల్య వివాహాల స్థాయిలో కాకపోయినా.. తన మనమరాలు వయసుండే మైనర్ ను పెళ్లి చేసుకున్న ఓ వృద్ధుడు నెల రోజులు తిరక్కముందే ఆమెకు విడాకులిచ్చాడు. ఎందుకో తెలుసా..?

  • News18
  • Last Updated :
    పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ తెలుసు కదా.. తెలుగునాట ఆ కథ తెలియనివారే ఉండరు. అందులో ఒక బాలికను వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఆ వృద్ధుడు కొద్దికాలానికే మరణిస్తాడు. దీంతో ఆమె వితంతువుగా మారుతుంది. ఈ కథ ఒకనాటి సమాజంలోని వితంతు వ్యవస్థను ఎత్తిచూపింది. ఈ స్థాయిలో కాకపోయినా.. ఇక్కడ ఒక వృద్ధుడు తనకు మనమరాలు వరసైన బాలికతో పెళ్లి కుదుర్చుకున్నాడు. ఇద్దరి మనసులు కలవడంతో.. పెద్ద మనుషులు పెళ్లి కూడా చేశారు. కానీ నెల కూడా తిరక్కముందే ఆ పెళ్లి పెటాకులైంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్, ఫోటోలు వైరల్ గా మారాయి.  అసలేం జరిగింది..?

    ఇండోనేషియా కు చెందిన అబా సర్ణా (78)కు.. కొద్దిరోజుల క్రితమే నోని నవిత (17) అనే బాలిక (భారతీయ చట్టాల ప్రకారం చూస్తే ఆమె మైనరే) తో పెళ్లి నిశ్చయమైంది. రెండు వైపుల వాళ్లు మాట్లాడుకుని పెళ్లి ఘనంగా చేశారు. ఇక్కడివరకు భాగానే ఉంది. కానీ ఏమైందో ఏమో గానీ.. ఉన్నట్టుండి అబా సర్ణా ఆమెకు విడాకులిస్తానని చెప్పాడు. అన్నట్టుగానే 22 రోజుల తర్వాత నోనికి విడాకులిచ్చాడు.

    అనుకున్నదే తడువుగా పెద్దలను పిలిపించి.. విడాకుల కార్యక్రమాన్ని కానిచ్చేశాడు. దీనిపై బాధితురాలి సోదరి స్పందిస్తూ.. ‘మా కుటుంబానికి ఆ వ్యక్తి వయసు గురించి ఏం సమస్య లేదు. మేమంతా ఆయనను అంగీకరించాం. కానీ ఏమైందో తెలియదు.. ఉన్నట్టుండి విడాకులిస్తానన్నాడు. ఇచ్చాడు..’ అని వాపోయింది. నోనికి విడాకులిచ్చిన అబా.. పెళ్లికి తాను పెట్టిన వస్తువులన్నింటినీ తిరిగిచ్చేయాలని పట్టుబట్టి.. అవన్నీ తీసుకెళ్లాడు.

    అయితే అసలేమైందని విషయం ఆరా తీయగా.. ఆ వృద్ధుడు పెళ్లికి ఒప్పకున్నా.. ఆయన ఇంట్లో మాత్రం అందుకు అంగీకారం లేదట. వాళ్లు ఆ పెళ్లికి ససేమిరా ఒప్పుకోమన్నా.. ఆయన కాదని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఇంట్లో వాళ్లెవరూ ఆయనతో మాట్లాడలేదట. అంతేగాక నోని కూడా పెళ్లి కాకముందు గర్భవతి అయిందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

    image : Facebook


    కాగా, పెళ్లి సందర్భంగా నోనికి మోటార్ సైకిల్, ఒక మ్యాట్రెస్ (పరుపు), ఇతర సామానులు కొనిచ్చాడు. విడాకులైన వెంటనే వాటన్నింటినీ తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. వీటి విలువ సుమారు రూ. 50 వేల పైనే ఉంటుందని ఆమె తరఫు బంధువులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు ఫేస్బుక్ లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Facebook, Social Media, Trending, Viral, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు