75 ఏళ్ల వయస్సులో ఆడపిల్లకు జన్మ .. మంగమ్మ రికార్డ్స్ బ్రేక్

పండంటి కవల పిల్లలకు మంగాయమ్మ జన్మనిచ్చింది. తాజాగా ఈ రికార్డ్స్ బ్రేక్ చేసింది రాజస్థాన్ కోటాకు చెందిన 75 ఏళ్ల బామ్మ


Updated: October 16, 2019, 4:25 PM IST
75 ఏళ్ల వయస్సులో ఆడపిల్లకు జన్మ .. మంగమ్మ రికార్డ్స్ బ్రేక్
నమూనా చిత్రం

Updated: October 16, 2019, 4:25 PM IST
తల్లి కావాలనే కోరికను 74 ఏళ్ల వయస్సులో తీర్చుకుంది తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఎర్రమట్టి మంగాయమ్మ. ఈవిడకి 1962లో పెళ్లైంది.అప్పటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. కానీ వాళ్ల కోరిక తీరలేదు. 73 ఏళ్లొచ్చినా... మంగాయమ్మకు పిల్లలపై కోరిక తగ్గలేదు. ఈ క్రమంలో 2018లో చెన్నై వెళ్లిన మంగాయమ్మ దంపతులు... ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానం పొందాలని ప్రయత్నించినా అదీ విఫలమైంది. అయినప్పటికీ ఆశ వదులుకోని దంపతులు 2018 నవంబర్‌లో గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడ మంగాయమ్మ మరోసారి ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయ్యింది. డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ నిపుణులు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉమాశంకర్ టీమ్... ఈ ఆపరేషన్ నిర్వహించింది. పండంటి కవల పిల్లలకు మంగాయమ్మ జన్మనిచ్చింది. తాజాగా ఈ రికార్డ్స్ బ్రేక్ చేసింది రాజస్థాన్ కోటాకు చెందిన 75 ఏళ్ల బామ్మ.పిల్లలు లేని ఈవిడ కూడా పిల్లల కోసం ఎంతగానో ప్రయత్నించారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు కానీ లాభం లేకుండా పోయింది. చివరికి ఆమె ఐవీఎఫ్ పద్దతి ద్వారా  గర్భం దాల్చినట్లు కింకార్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.పుట్టిన ఆడబిడ్డ 600 గ్రాములు బరువు ఉంది.ప్రస్తుతం బిడ్డ నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉంది అని తెలిపారు.ఇదిలా ఉంటే మంగమ్మ రికార్డ్స్ ని 75 ఏళ్ల వయస్సులో బిడ్డకి జన్మనిచ్చి బ్రేక్ చేసింది ఈ బామ్మ...

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...