• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • 71 YEAR OLD MAN LIFTS 234 KGS AND SETS FOUR WORLD RECORDS IN SANDIEGO SK GH

Weight Lifting: వెయిట్ లిఫ్టింగ్‌లో వృద్ధుడి ప్రపంచ రికార్డు.. 234 కేజీలు ఉఫ్..

రూడీ కాండ్లబ్ వెయిట్ లిఫ్టింగ్

Weight Lifting: 71 ఏళ్ల ఓ వృద్ధుడు వెయిట్ లిఫ్టింగ్‌లో అదరగొడుతున్నాడు. యువకులకు కూడా సాధ్యం కాని.. ఫీట్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వందల కేజీల బరువులను అలవోగా ఎత్తేస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

  • Share this:
25 ఏళ్ల వయసుండి.. ఉడుకు రక్తమున్న యువకుల్లోనూ.. చాలా మంది జిమ్‌కు వెళ్లరు. కనీసం ఇంట్లో కూడా వర్కవుట్స్ చేయరు. వ్యాయామాన్ని పూర్తగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏ మాత్రం ఫిట్‌నెస్ లేకుండా.. పెద్ద పెద్ద పొట్టలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది 71 ఏళ్ల ఓ వృద్ధుడు వెయిట్ లిఫ్టింగ్‌లో అదరగొడుతున్నాడు. యువకులకు కూడా సాధ్యం కాని.. ఫీట్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వందల కేజీల బరువులను అలవోగా ఎత్తేస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.. శరీరానికి దానితో సంబంధం లేదు.. అని నిరూపిస్తున్నాడు. ఏకంగా 234 కేజీల బరువు ఎత్తి ఏకంగా నాలుగు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.

వివరాల్లోకి వెళ్తే.. 71 ఏళ్ల వయసున్న రూడీ కాండ్లబ్ (Rudy Kandlub) అనే వృద్ధుడు 2020లో శాన్ డియాగో(San Diego)లో జరిగిన USPA నార్త్ అమెరికన్ ఛాంపియన్‌షిప్‌(Championship)లో పాల్గొని నాలుగు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. స్నాచ్లో 234 కిలోలు, స్క్వాట్‌లో 195 కిలోలు, బెర్క్‌లో 303 కిలోల బరువున్న డెడ్ లిఫ్ట్‌ను పైకెత్తి రికార్డు సృష్టించాడు. వృద్ధాప్యంలో అతను చేసిన వెయిట్ లిఫ్టింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతను సాధించిన ఘనతను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ వీడియోలను కూడా షేర్ చేశాడు.








View this post on Instagram






A post shared by Rudy Kadlub (@rudykadlub)






అమెరికాలోని శాన్ డియాగోలో జరిగిన యుఎస్‌పిఎ డ్రగ్-టెస్ట్డ్ నార్త్ అమెరికన్ ఛాంపియన్‌షిప్‌లో తాను కనబర్చిన ఈ ప్రతిభకు తోడ్పడిన తన కోచ్‌లు, శిక్షణ భాగస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశాడు. రూడీ కాండ్లబ్ Rudy Kandlub) రికార్డును అభినందిస్తూ, అతన్ని తమ ‘హీరో’ అని నెటిజన్లు పిలుస్తున్నారు. 71 సంవత్సరాల వయస్సులో అతని సంకల్పం, కృషికి గాను అనేక మంది నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ వయసులో కూడా ఇంతటి ఫిట్నెస్ మెయింటెయిన్ ఎలా చేయగలుగుతున్నారని, దీని వెనకా ఉన్న రహస్యం ఏమిటని చాలామంది అడుగుతున్నారు. నెటిజన్లు అతన్ని ఆదర్శప్రాయుడిగా, ఫిట్‌నెస్ గోల్స్గా పేర్కొంటూ అభినందిస్తున్నారు. కాగా, రూడీ కాండ్లబ్ కేవలం ఒక్క రోజులోనే 567 కిలోల బరువు ఎత్తి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అతని ఫిట్నెస్ ప్రయాణం 55 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా మారటానికి చాలా కష్టపట్టాడు. 71 సంవత్సరాల వయస్సులో అనేక టైటిల్స్, రికార్డులను సాధించాడు.

80 కిలోల బరువులెత్తి రికార్డు సృష్టించిన 7 ఏళ్ల చిన్నారి

ఇదిలా ఉంటే కెనడా(Canada)కు చెందిన రోరీ వాన్ ఉల్ట్(Rory van Ulft) అనే 7 ఏళ్ల వయసున్న చిన్నారి వెయిట్ లిఫ్టింగ్లో సంచలనాలు నమోదు చేస్తోంది. యూఎస్ అండర్–11, అండర్–13లో 30 కిలోల వెయట్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుతాలు చేసి టైటిల్స్ సాధించింది. ఈ టైటిల్ను ఇప్పటివరకు అందుకున్న అమెరికన్లలో అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కింది. అమెరికా యూత్ నేషనల్ ఛాంపియన్ (Youth National Champion)గా కూడా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా డెడ్లిఫ్ట్లో ఏకంగా 80 కిలోల బరువులు ఎత్తి మరో అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఒలింపిక్ మహిళల బార్ను ఉపయోగించి స్నాచ్లో 32 కిలోలు, జెర్క్లో 42 కిలోల బరువులతో పాటు స్క్వాట్లో 61 కిలోల బరువు ఎత్తింది. ఈ చిన్నారి విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published: