హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: సింగిల్ హ్యాండ్‌తో హోటల్ నడుపుతున్న 70ఏళ్ల వృద్ధురాలు .. 35రూపాయలకే ఢిల్లీలో టేస్టీ టిఫిన్

Viral video: సింగిల్ హ్యాండ్‌తో హోటల్ నడుపుతున్న 70ఏళ్ల వృద్ధురాలు .. 35రూపాయలకే ఢిల్లీలో టేస్టీ టిఫిన్

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Viral Video : 70ఏళ్ల వయసులో ఉన్న వృద్ధులు ఏమి చేయలని స్థితిలో ఉంటారు. కాని ఢిల్లీలో ఓ ఆంటీ మాత్రం దర్జాగా సింగిల్‌గా క్యాంటిన్ నిర్వహిస్తోంది. అంతే కాదు 35రూపాయలకు రుచికరమైన థాలీని వడ్డిస్తూ అందరి కడుపు నింపుతూ శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పుడు ఆమె వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

జీవితంలో బ్రతకడం కష్టం కాదు. ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా సొంత కాళ్లపై నిలబడి బ్రతకడం గొప్ప విషయం. ప్రస్తుత సమాజంలో యుక్త వయసులో ఉన్న వాళ్లు కాయ, కష్టం చేయడానికే కాదు సుఖంగా కూర్చొని ఉద్యోగం చేయడానికి కూడా బద్ధకిస్తున్నారు. చేస్తున్న పని భారంగా ఫీలవుతూ ఎంతో ఇబ్బందికరంగా కాలం వెళ్లదీస్తున్నారు. కాని దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో  ఏడు పదుల వయసున్న వృద్ధురాలి(70year old woman)ని చూస్తే ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ పెద్దావిడను స్పూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకుపోవాలనే అనుకుంటారు.

అయ్యో.. పాపం. డాక్టర్ కోసం గంటల తరబడి ఎదురు చూసిన తల్లి.. చివరకు ఏమైందంటే..స్వశక్తితో నిలబడుతున్న 70ఏళ్ల వృద్ధురాలు..

ఢిల్లీలో ఏ వస్తువు తక్కువ ధరకు దొరకవు. ముఖ్యంగా కడుపు నింపే భోజనం, టిఫెన్ ఐటమ్స్ విషయానికి వస్తే ఎక్కువ ఖరీదు పెట్టి తినాల్సిందే తప్ప తక్కువ ధరకు దొరకడం చాలా అరుదు. అయితే ఢిల్లీలోని సెంట్రల్ మార్కెట్ సమీపంలో కేఎఫ్‌సీకి ఎదురుగా చిన్న క్యాంటిన్ కనిపిస్తుంది. అక్కడ ఓ 70సంవత్సరాల వృద్ధురాలు సింగిల్‌గా  క్యాంటిన్ నిర్వహిస్తోంది. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఈ వృద్ధురాలు కేవలం 35రూపాయలకే రుచికరమైన థాలిని అందిస్తోంది. 35రూపాయలకు నాలుగు రోటీలతో పాటు రెండు పరోట, కొద్దిగా రైస్, రెండు రకాల కూరలు వడ్డిస్తోంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ థాలిని ఎలాంటి చెఫ్‌లు, కుక్‌లు లేకుండా కేవలం తానే ఓ బల్లపై కూర్చొని అప్పటికప్పుడు రోటీని తయారు చేసి కాల్చి వేడి వేడిగా వడ్డిస్తుంది.


సూపర్‌ థాలీ..

70ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిపోయాననే బాధ పడకుండా, వయసు పైబడిందనే చింతన లేకుండా హాయిగా పని చేసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడుతోంది. ఎంతో మందికి రుచికరమైన థాలిని అతి తక్కువ ధరకే అమ్ముతూ అందరికి కడుపు నింపుతోంది. ఈ 70సంవత్సరాల బామ్మగారి థాలి సెంటర్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రెస్టారెంట్‌లకు వెళ్లి వేలకు వేలు బిల్లులు, వందల్లో జీఎస్టీ చెల్లించే వాళ్లు ఒక్కసారైనా ఆ బామ్మగారి క్యాంటిన్‌కి వెళ్లి ఆమె చేతి వంట రుచి చూస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియో..

అంతే కాదు ..జీవితంలో హాయిగా కూర్చొని తినాల్సిన వయసులో ఇంకా తన కడుపు నింపుకోవడం కోసం కష్టపడుతున్న పెద్దావిడకు ఆర్ధిక సాయం చేసిన వాళ్లం అవుతామని నెటిజన్లు కోరుతున్నారు. ఢిల్లీకి వెళ్లే వాళ్లు తప్పని సరిగా ఆంటీ క్యాంటిన్‌ని సందర్శించాలని..ఈ వీడియోని అందరికి షేర్ చేయమని రిక్వెస్ట్ పోస్ట్ పెడుతున్నారు.

First published:

Tags: Delhi news, Viral Video

ఉత్తమ కథలు