హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: 71సంవత్సరాల వయసులో ఏంటా పని ..

OMG: 71సంవత్సరాల వయసులో ఏంటా పని ..

OMG: 71సంవత్సరాల వృద్ధురాలు అరుదైన రికార్డ్ నెలకోల్పింది. అమెరికాలో పోల్ డ్యాన్స్‌ చేస్తూ 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది గ్రెటా.

OMG: 71సంవత్సరాల వృద్ధురాలు అరుదైన రికార్డ్ నెలకోల్పింది. అమెరికాలో పోల్ డ్యాన్స్‌ చేస్తూ 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది గ్రెటా.

OMG: 71సంవత్సరాల వృద్ధురాలు అరుదైన రికార్డ్ నెలకోల్పింది. అమెరికాలో పోల్ డ్యాన్స్‌ చేస్తూ 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది గ్రెటా.

చురుకుదనం, ఉత్సాహం, చేస్తున్న పని మీద శ్రద్ద చూస్తుంటే ఎవరికైనా ఆమెలో ఇంకా చాల విషయం ఉందనే అనిపిస్తుంది. ఏడు పదుల వయసు దాటిన వృద్ధురాలు ఎలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కర్ర సహకారం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉంటుంది. కాని ఆమె మాత్రం తగ్గేదేలే అంటోంది. సెవంటీ ప్లస్‌లో ఉన్నప్పటికి సెవంటీన్‌ ఈయర్స్‌ అమ్మాయి కూడా ఉండనంత చలాకీగా ఉంటుంది. తాడులా మారిపోయి పోల్‌ని చుట్టేసుకుంటుంది. ఒంట్లో ఎముకలే లేనట్లుగా కరెంట్ తీగలా ఎటుపడితే అటు మెలికలు తిరిగిపోతుంది. 71సంవత్సరాల గ్రేటాను చూసినా ఆమె టాలెంట్‌ గురించి తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. గ్రేటా(Greta) కాలిఫోర్నియా(California)లో నివసిస్తోంది. 71సంవత్సరాల వృద్దురాలు 11సార్లు పోల్ డ్యాన్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌(11 world championships)ని గెలుచుకుంది. చిన్న వయసు నుంచి జిమ్నాస్టిక్స్‌ చేయాలనే ఇష్టంతో ఉండేది. అయితే 59సంవత్సరాల వయసులో గ్రేటా బోలు ఎముకల వ్యాధి నయం చేసుకోవడానికి పోల్ డ్యాన్స్ మొదలుపెట్టింది. మొదట్లో కాస్త ఇబ్బందిగా, కష్టంగా ఉన్నప్పటికి ఆమెలోని పట్టుదల, గురుత్వాకర్షణను కంట్రోల్ చేయగలిగే ట్రిక్స్‌ నేర్చుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది గ్రిటా. విజయపరంపర ఇప్పటికి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 11సార్లు వరల్డ్‌ టాప్‌ పోల్ డ్యాన్సర్‌ టైటిల్‌ని గెలుచుకునేలా చేసింది. పెరుగుతున్న వయసును తాను ఒక సంఖ్యలా చూస్తాను తప్ప తన సంకల్పాన్ని తగ్గించేది కాదంటోంది.

ఆసక్తి తగ్గలేదు..

62 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కాలిఫోర్నియాలో నివాసముండేది గ్రెటా. మొదటి సారి తనకంటే సుమారు 50సంవత్సరాల చిన్నదైన 18ఏళ్ల పోల్‌ డ్యాన్సర్‌తో పోటీ పడింది. ఆ విజయంతో అప్పటి నుండి, ఆమె ప్రపంచ వరల్డ్ పోల్‌ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు, ఆమె మొత్తం 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం, డబుల్ హిప్ రీప్లేస్‌మెంట్ కూడా జరగని కారణంగా గ్రెటాను పోల్ డ్యాన్స్‌కు దూరం చేసింది. ఆమె కథ ఇతరులకు స్పూర్తిదాయం అంటున్నారు నెటిజన్లు.


ఓల్డ్ లేడీ కాదు స్ట్రాంగ్‌ విమెన్..

గ్రెటా పూర్తి పేరు గ్రెటా పొంతరెల్లి. కాలిఫోర్నియాలోనే ఉంటున్నఈ సెలబ్రిటి తనతో పాటు కాలేజీ స్టూడెంట్స్‌కి పోల్‌ డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తోంది.  మహిళలు ఎక్కడైన సొంతగా తమ కాళ్లపై నిలబడాలన్నదే తన కోరిక అని అంటోంది గ్రెటా.

First published:

Tags: Us news, Uttarakhand

ఉత్తమ కథలు