అతనికి భార్య లేదు. ఆమెకు భర్త లేడు. వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఈక్రమంలోనే ఒకరిని మరొకరు ఇష్టపడ్డారు. ఒంటరిగా జీవించడం కంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం బెటర్ అనుకున్నారు. అంతే తమ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఇద్దరి వయసులో తేడా ఎంత ఉంది..? సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచించలేదు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి దండలు మార్చుకున్నారు. ఆమె నుదుటిపై తిలకం దిద్ది తన భార్యను చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో అసలు పెళ్లి చేసుకున్న వాళ్లిద్దరూ ఎవరో కాదు సొంత మామ, కోడలు. ఈ పెళ్లి వేడుకకు బంధు,మిత్రులు కూడా హాజరయ్యారు. అయితే కోడలిని మామయ్య భార్యగా చేసుకున్న విషయం తెలిసిన స్థానికులు అవక్కైపోయారు. తర్వాత ఏం జరిగిందంటే.
కోడలిని భార్యగా మార్చుకున్న మామ..
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని బర్హల్‌గంజ్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన 70సంవత్సరాలకైలాష్ యాదవ్ తన కోడలు పూజ అనే 28సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నాడు. హిందూ ధర్మం ప్రకారం ఇది సరైనది కాకపోయినప్పటికి వాళ్లు ఇద్దరూ ఇష్టపడటంతో గుడికి వెళ్లి మరీ పెళ్లి చేసుకున్నారు. కోడలిని భార్యగా మార్చుకున్న మామ, కోడలి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
కొడుకు లేని లోటు తీర్చాలని..
70సంవత్సరాల వృద్ధుడు కైలాష్ యాదవ్ బదల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి నలుగురు సంతానం. 12ఏళ్ల క్రితం తన భార్య చనిపోయింది. వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తీరు కైలాష్ యాదవ్‌కు నచ్చకపోవడంతో విడాకులు తీసుకున్నాడు. ఈక్రమంలోనే తన మూడో కుమారుడు వివాహం అనంతరం చనిపోయాడు. అతని భార్యే పూజ. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఒంటరిగా ఇంట్లోనే ఉంటోంది. కోడలు ఒంటరి తనాన్ని చూడలేకపోయిన కైలాష్ యాదవ్ ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాధించాలనుకున్నాడు.
లేటు వయసులో లేటెస్ట్ పెళ్లి..
అదే విషయాన్ని పూజకు చెప్పడంతో మామయ్య మాట నచ్చి..అతనితో జీవితాన్ని పంచుకోవడం ఇష్టంగా భావించి పెళ్లికి అంగీకరించింది. అంతే సమాజం ఏమనుకున్నా..తమ మధ్య సంబందాన్ని తప్పు పట్టినా లెక్క చేయకుండా గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంతరం గుడిలో ప్రదక్షిణలు చేసి భార్యగా చేసుకున్న కోడలి నుదుటన తిలకం దిద్దాడు కైలాష్ యాదవ్. ఈ లేటు వయసులో కోడలిని భార్యగా చేసుకున్న ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వార్త అంతటా ప్రచారమైంది.
కోడలితో కొత్త జీవితం..
ఇరువురి అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగినట్లుగా సమాచారం. పెళ్లి సమయంలో గ్రామస్తులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సమాజంతో సంబంధం లేకుండా వీరిద్దరి పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు, పూజ కూడా తన కొత్త సంబంధంతో సంతోషంగా ఉన్నట్లు అనిపించింది.
ఆశ్చర్యపోతున్న జనం..
ఈ అపూర్వ వివాహం విషయం పోలీసులకు చేరడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. వైరల్ అవుతున్న ఫోటో ద్వారానే ఈ వివాహం గురించి మాకు తెలిసిందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ బర్హల్‌గంజ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంశమని, ఎవరికైనా ఫిర్యాదు ఉంటే పోలీసులు దర్యాప్తు చేయవచ్చని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral photo, Wedding