పీవీ సింధుతో పెళ్లి చేయండి.. లేకపోతే కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ల వ్యక్తి పిటిషన్..

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని ఓ వృద్ధుడు(70) ఏకంగా జిల్లా కలెక్టర్‌‌కు విజ్ఞప్తి చేశాడు. లేకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు తాను వెనుకాడబోనని చెప్పాడు.

news18-telugu
Updated: September 17, 2019, 5:33 PM IST
పీవీ సింధుతో పెళ్లి చేయండి.. లేకపోతే కిడ్నాప్ చేస్తా.. 70 ఏళ్ల వ్యక్తి పిటిషన్..
పీవీ సింధుతో తన పెళ్లి చేయాలని వృద్ధుడి పిటిషన్
news18-telugu
Updated: September 17, 2019, 5:33 PM IST
వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని ఓ వృద్ధుడు(70) ఏకంగా జిల్లా కలెక్టర్‌‌కు విజ్ఞప్తి చేశాడు. లేకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు తాను వెనుకాడబోనని చెప్పాడు. ఆ వృద్ధుడు తన వయసు 16 ఏళ్లని పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం. తమిళనాడు లోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి.. పీవీ సింధుతో వివాహం చేయాలని జిల్లా కలెక్టర్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు. సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను కిడ్నాప్ చేసైనా సరే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. సింధు ఆట తీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు.

కాగా, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. పైగా తన వయసు 16 ఏళ్లని, 2004 ఏప్రిల్‌ 4 న పుట్టానని పేర్కొనడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ వింత అభ్యర్థనను చూసి కలెక్టర్ కూడా కంగు తిన్నారు. అయితే మలైస్వామి మాత్రం తనకు సింధుతో పెళ్లి చేయాల్సిందేనని పట్టు పడుతుండటం విశేషం.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...