Video : ఏడుగురు అమ్మాయిలు... కలిసి జీవించాలనుకున్నారు... రూ.4 కోట్లతో వాళ్లు కట్టించుకున్న ఇల్లు చూశారా...
China News : చైనాలో రిటైర్మెంట్ తర్వాత నలుగురు ముసలి అవ్వలు... కలిసి జీవించారు. వాళ్ల జీవితాల ఆధారంగా గోల్డెన్ గర్ల్స్ అనే పేరుతో వచ్చిన సిరీస్ పాపులర్ అయ్యింది. ఇప్పుడు అదే విధంగా... ఏడుగురు అమ్మాయిలు జీవిత ప్రయాణం మొదలుపెట్టారు.

ఏడుగురు స్నేహితురాళ్లు నిర్మించుకున్న భవనం. (Image : YouTube)
- News18 Telugu
- Last Updated: July 14, 2019, 12:58 PM IST
రిటైర్మెంట్ తర్వాత ఇక ఏ పనీ చెయ్యకుండా... ప్రశాంత వాతావరణంలో హాయిగా జీవించాలనుకున్నారు చైనాలోని ఆ ఏడుగురు స్నేహితురాళ్లు. అందరిదీ అదే ఆలోచన. అందువల్ల వాళ్లంతా డబ్బులు పోగేసి... దాదాపు రూ.4 కోట్లతో... గ్వాంగ్జౌ ప్రావిన్స్‌లో ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నారు. అసలీ ఆలోచన వాళ్లకు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిందట. ఆ మాటల్లో... ఓ అమ్మాయి... తాను ఊరి చివర ఖాళీ ప్రదేశంలో ఓ పాత భవనాన్నిచూశాననీ... దాన్ని కూల్చేసి... అదే 700 చదరపు మీటర్ల స్థలంలో కొత్త ఇల్లు కట్టుకుందాం అంది. మిగతా ఫ్రెండ్స్ కూడా సరే అన్నారు. రిటైర్మెంట్ తర్వాత కలిసి జీవించేందుకు అందరూ ఒప్పుకున్నారు.

ఈ ఏడుగురు అమ్మాయిలూ దాదాపు 20 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. ప్రస్తుతం అందరూ జాబ్స్ చేస్తున్నారు. 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత ఓ పదేళ్ల పాటూ కలిసి జీవించాలని అనుకున్నట్లు తెలిపింది ఇతియావ్.
ప్లాన్ ప్రకార అందరూ డబ్బులు పోగేసి గతేడాది ఓ స్థలంలోని పాత ఇంటిని కొన్నారు. దానికి మెరుగులు దిద్ది... అద్భుతమైన అత్యాధునిక మాన్షన్‌ను తయారుచేశారు. ఈ మూడున్నర అంతస్థుల ఎస్టేట్ చుట్టూ అందమైన కొండలు, అడవులు, గార్డెన్ ఉన్నాయి. అద్భుతమైన ప్రదేశంలో ఆ బిల్డింగ్ కట్టిపడేస్తోంది.

ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంది. పై ఫ్లోర్లో ఏడుగురికీ ఏడు బెడ్రూమ్స్ ఉన్నాయి.
అద్భుతమైన ఫర్నిషింగ్‌తో ఇంటీరియర్స్ తీర్చిదిద్దారు. ఇందులోని ఎక్కువ ఫర్నిచర్‌ని ఇండియా, మొరాకో నుంచీ తెప్పించారు.

వీళ్లందరికీ టీ తాగడమంటే ఇష్టం. అందువల్ల పెవీలియన్ దగ్గర ఉండి టీ తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.

అసలు వీళ్లు కలిసి ఎలా ఉంటారన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. అదేం సమస్య కాదంటున్నారు వాళ్లు. ఎందుకంటే తమలో కొంతమందికి వంట వండటం వచ్చు.

కొందరు పాటలు పాడగలరు, వాయిద్యాలను ప్లే చెయ్యగలరు, కూరగాయల్ని పండించగలరు.

చైనా మెడిసిన్ కూడా తెలిసినవాళ్లున్నారు. అందువల్ల తమకు ఒంటరిగా ఉంటున్నామనే ఫీలింగే ఉండదంటున్నారు.

ఆ ఏడుగురికి సంబంధించిన వీడియో మీరే చూడండి.

అందరిదీ ఒకటే ఆలోచన

కలిసి జీవిస్తే హాయి
2020 నాటికి కృత్రిమ సూర్యుడిని సృష్టించనున్న చైనా...
బాహుబలి బ్లాక్ హోల్ గుర్తింపు...70 సూర్యగోళాలను మింగేస్తుందట...
షూటింగ్ సెట్లో కిందపడి నటుడి మృతి..
నత్తగుల్ల ఎంత పనిచేసింది.. 15 ఏళ్లుగా అతని బాధ వర్ణనాతీతం..
మనిషి ముఖాన్ని పోలిన అరుదైన చేప.. సోషల్ మీడియాలో వైరల్..
జమ్మూకాశ్మీర్‌పై చైనా వ్యాఖ్యలకు భారత్ దీటైన కౌంటర్
ప్లాన్ ప్రకార అందరూ డబ్బులు పోగేసి గతేడాది ఓ స్థలంలోని పాత ఇంటిని కొన్నారు. దానికి మెరుగులు దిద్ది... అద్భుతమైన అత్యాధునిక మాన్షన్‌ను తయారుచేశారు. ఈ మూడున్నర అంతస్థుల ఎస్టేట్ చుట్టూ అందమైన కొండలు, అడవులు, గార్డెన్ ఉన్నాయి. అద్భుతమైన ప్రదేశంలో ఆ బిల్డింగ్ కట్టిపడేస్తోంది.

అద్భుత ప్రదేశం
ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంది. పై ఫ్లోర్లో ఏడుగురికీ ఏడు బెడ్రూమ్స్ ఉన్నాయి.

ఇంటిలోపల బెడ్ రూం
అద్భుతమైన ఫర్నిషింగ్‌తో ఇంటీరియర్స్ తీర్చిదిద్దారు. ఇందులోని ఎక్కువ ఫర్నిచర్‌ని ఇండియా, మొరాకో నుంచీ తెప్పించారు.

అద్భుతమైన ఇల్లు
వీళ్లందరికీ టీ తాగడమంటే ఇష్టం. అందువల్ల పెవీలియన్ దగ్గర ఉండి టీ తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.

ఏడుగురు స్నేహితురాళ్లు నిర్మించుకున్న భవనం. (Image : YouTube)
అసలు వీళ్లు కలిసి ఎలా ఉంటారన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. అదేం సమస్య కాదంటున్నారు వాళ్లు. ఎందుకంటే తమలో కొంతమందికి వంట వండటం వచ్చు.

ఆకట్టుకుంటున్న లొకేషన్
కొందరు పాటలు పాడగలరు, వాయిద్యాలను ప్లే చెయ్యగలరు, కూరగాయల్ని పండించగలరు.

ఇంట్లోంచీ చూస్తే ఇలా...
చైనా మెడిసిన్ కూడా తెలిసినవాళ్లున్నారు. అందువల్ల తమకు ఒంటరిగా ఉంటున్నామనే ఫీలింగే ఉండదంటున్నారు.

చక్కటి ఇంటీరియర్