అమ్మాయిలు పడ్డం లేదు... 20 ఏళ్ల వయసు తగ్గించండంటూ కోర్టుకెక్కాడు...

ఏజ్ ఎక్కువుండడంతో డేటింగ్ సైట్లలో అమ్మాయిలు పట్టించుకోవడం లేదు... చట్టబద్ధంగా 20 ఏళ్లు వయసు తగ్గించండి... నెదర్లాండ్స్‌లో పర్సనాలిటీ గురు వింత కోరిక... పెన్షన్ తీసుకోవడం కూడా ఆపేస్తానంటూ ఆప్షన్ ఇచ్చిన 69 ఏళ్ల వృద్ధుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 8:36 PM IST
అమ్మాయిలు పడ్డం లేదు... 20 ఏళ్ల వయసు తగ్గించండంటూ కోర్టుకెక్కాడు...
డచ్ వార్తాపత్రిక డి టెలిగ్రాఫ్‌లో వచ్చిన ఎమిలి రాటెల్‌బ్యాండ్ కథనం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 8:36 PM IST
లేటు వయసులో ఘాటు ప్రేమలో తేలిపోతుంటారు చాలామంది. అరవై దాటిని ఇరవై ఊపుతో రెచ్చిపోతుంటారు. వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే అని తీసిపారేసేవాళ్లు కోకొల్లలు. అయితే ఓ పెద్దయాన మాత్రం తన వయసును తగ్గించండి అంటూ కోర్టుకెక్కాడు ఓ పెద్దమనిషి... 69 ఏళ్ల వయసులో డేటింగ్ చేసేందుకు ఆరాటపడిన ఓ డచ్ వృద్ధుడు... ‘డేటింగ్‌కి తన ఏజ్‌ ఇబ్బందిగా మారింది... కనీసం 20 ఏళ్లు తగ్గించండి మహాప్రభో...’ అంటూ కోర్టుకెక్కాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ విచిత్ర సంఘటన అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.

నెదర్లాండ్స్‌లో పర్సనాలిటీ గురుగా పాపులారిటీ తెచ్చుకున్న ఎమిలి రాటెల్‌బ్యాంగ్ వయసు 69 ఏళ్లు. అయితే అమ్మాయిలతో డేటింగ్ చేసేందుకు తన ఏజ్ ఇబ్బందిగా మారిందట. దాంతో తన వయసు 20 ఏళ్లు తగ్గించి 49 అంటూ అధికారికంగ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ‘నన్ను పరీక్షించిన డాక్టర్లు మానసికంగా, శారీరకంగా నా వయసు 45 ఏళ్లే అని తేల్చారు. ఏజ్ 69 అని డేటింగ్ సైట్లలో పెడితే ఏ అమ్మాయీ రియాక్షన్ ఇవ్వడం లేదు. ఏజ్ తగ్గిస్తే నాతో డేటింగ్ చేయడానికి ఆసక్తి చూపించేవాళ్లు చాలామంది వస్తారు...’ అంటూ తన వాదన వినిపించాడు రాటెల్‌బ్యాంగ్. చూడడానికి దిట్టంగా ఉన్నాను, బోలెడు డబ్బులూ సంపాదించా... పుట్టినరోజు 20 ఏళ్లు ముందుకు జరిపి పుణ్యం కట్టుకోండి మహాప్రభో...’ అంటూ వేడుకున్నాడు. అయితే ఇలాంటి కేసు ఇప్పటిదాకా ఎక్కడా, ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పిన న్యాయమూర్తి... ‘పుట్టినతేదీని మారిస్తే కనిపెంచిన తల్లిదండ్రులు బాధపడతారని’ చెప్పాడు. అయితే పెన్షన్ తీసుకోవడం కూడా ఆపేస్తానంటూ ఆప్షన్ ఇవ్వడంతో ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని కేసు కొట్టేశాడు న్యాయమూర్తి.

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...