Home /News /trending /

66YEAR OLD HOLDS THE GOLDEN BOOK OF WORLD RECORDS FOR SWIMMING IN THE SEA WITH HIS LEGS AND ARMS TIED IN KARNATAKA SNR

ఆయన ఓల్డ్‌ మెన్‌ కాదు..గోల్డ్‌ మెన్..సముద్రానికి ఎదురీదిన డాల్ఫిన్

Photo Credit:Twitter

Photo Credit:Twitter

OMG: రిటైర్మెంట్‌ వయసులో రికార్డు సృష్టించాడాయన. కాళ్లు,చేతులు బంధించుకొని సముద్రంలో గంటన్నర పాటు ఈతకొట్టి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆత్మవిశ్వాసం ముందు సముద్రమైనా తలవంచాల్సిందే అన్నారు శ్రీగంగాధర్‌ కడేకర్.

యువతలో స్పూర్తి నింపాలన్నది ఆయన ప్రయత్నం. అందుకోసం ఆరు పదుల వయసు దాటినప్పటికి ఏదో సాధించాలన్న పట్టుదల, అందులో విజయాన్ని రుచి చూడాలన్న కసి మెండుగా ఉంది. కర్నాటకకు చెందిన 66సంవత్సరాల శ్రీగంగాధర్ కడేకర్‌(Gangadhar G. Kadekar)ఉడిపిలోని పదుకెరె బీచ్‌లోంచి సముద్రంలోకి వెళ్లి సుమారు గంటన్నర పాటు ఈత కొట్టాడు. అది కూడా చేతులు, కాళ్లు ఆడిస్తూ అందరిలా కాకుండా చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసుకొని నీళ్లలో ఓ డాల్ఫిన్‌లా ఈదుతూ ప్రాణాల్ని పణంగా పెట్టి సహసం చేశారు. ఈనెల 24న శ్రీగంగాధర్‌ ఈ అరుదైన రికార్డును సృష్టించడమే కాకుండా సముద్రంలో 3.5 కిలోమీటర్ల దూరం ఈతకొట్టారు. సముద్రంలో సాహసం చేసిన శ్రీగంగాధర్‌ గోల్డెన్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో(Golden Book of World Records)కి ఎక్కారు. ఉదయం సరిగ్గా 7.50నిమిషాలకు రెండు చేతులు, కాళ్లను తాళ్లతో కట్టించుకొని ఉడిపిUdupi లోని పదుకెరె బీచ్‌(Padukere beach)లోంచి సముద్రం మధ్యలోకి దిగి ఈత కొట్టారు. ఉదయం మొదలైన ఈత మధ్యాహ్నం 1.25 నిమిషాలకు ముగిసింది. సుమారు గంటన్నర పాటు సముద్ర ప్రవాహానికి ఎదురీదిన శ్రీగంగాధర్‌కి గోల్డెన్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ (Golden Book of World Record)రికార్డ్స్ ప్రతినిధి మనీష్‌ విష్ణయ్ అవార్డ్‌ సర్టిఫికెట్‌ని అందజేశారు.

నాట్ ఓల్డ్ మెన్..హీజ్‌ గోల్డ్‌ మెన్..
కాళ్లు, చేతులు బంధించుకొని సముద్రంలో ఈతకొట్టడానికి వయసులో ఉన్న వాళ్లే సాహసం చేయరని..అలాంటిది రిటైర్మెంట్ వయసు దాటిన శ్రగంగాధర్‌ కడేకర్‌ ఆ రికార్డును సాధించడం చాలా గొప్ప విషయమని శ్రీ విష్ణోయ్‌ తెలిపారు. ఇలాంటి వాళ్లను ప్రస్తుతం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

డాల్ఫిన్‌లా ఈదేస్తాడు..
అరుదైన రికార్డు నెలకోల్పిన తర్వాత సముద్ర జలాల్లోంచి బయటకు వచ్చిన శ్రీగంగాధర్‌ కడేకర్‌ మాట్లాడుతూ ..సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున ఈత కొట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అయితే తాను కచ్చితంగా సాధిస్తాననే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని చెప్పారు. తాను ఎంతో మంది పిల్లలకు ఈత కొట్టడం శిక్షణ ఇస్తున్నానని..పిల్లల్లో స్పూర్తిని నింపడానికే ఈ రికార్డు సృష్టించానన్నారు. ఈతరం పిల్లల్ని ప్రోత్సహించడానికి తాను ఏదైనా సహాసం చేసి నిరూపించాలని అనుకున్నానని..అది సాధించినందుకు గర్వంగా ఉందన్నారు శ్రీగంగాధర్‌ కాడేకర్.

యువతలో స్పూర్తి నింపాలని..
గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకోక ముందు కూడా ఇలాంటి అరుదైన ఫీట్ చేశారు. 2021 జనవరి 24వ తేదిన తన కాళ్లను తాళ్లతో బంధించుకొని పద్మాసనం భంగిమలో 73.7 నిమిషాలు అంటే సుమారు గంటకుపైగా నీళ్లలో 1.4 కి.మీ ఈత కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకున్నారు శ్రీగంగాధర్‌.
Published by:Siva Nanduri
First published:

Tags: Karantaka, Swimming

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు